ETV Bharat / bharat

కశ్మీర్​లో భద్రతా దళాలపై గ్రెనేడ్ దాడి.. ఒకరు మృతి

author img

By

Published : Feb 11, 2022, 7:55 PM IST

Bandipora Grenade attack: జమ్ము కశ్మీర్​లో భద్రతా దళాలపై గ్రెనేడ్ దాడి జరిగింది. ఈ ఘటనలో ఓ పోలీసు తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురికి గాయాలయ్యాయి.

Bandipora Grenade attack
Bandipora Grenade attack

Bandipora Grenade attack: జమ్ము కశ్మీర్ బందిపొరాలో గ్రెనేడ్ దాడి జరిగింది. ఈ ఘటనలో ఓ పోలీసు ప్రాణాలు కోల్పోయారు. మరో పోలీసు, ముగ్గురు సీఆర్​పీఎఫ్ సిబ్బంది గాయపడ్డారు.

నిషత్ పార్క్ సమీపంలో పోలీసులు, సీఆర్​పీఎఫ్ దళాలు ఓ చోట ఉన్నాయని, ఆ సమయంలో ఉగ్రవాదులే గ్రెనేడ్ దాడి చేశారని అధికారులు తెలిపారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. జమ్ము కశ్మీర్ పోలీసు శాఖలో డ్రైవర్​గా పనిచేసే జుబేర్ అహ్మద్ దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయాడని వెల్లడించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందన్నారు. దాడి చేసిన వ్యక్తిని గుర్తించేందుకు ఆ ప్రాంతాన్నంతటినీ తమ అధీనంలోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఇంతవరకు ఎవరినీ అరెస్టు చేయలేదని చెప్పారు.

ఇదీ చదవండి: 'ఆయనకు పిల్లలు లేరు.. ఈయనకు ఉన్నా...'.. మోదీపై లాలూ సెటైర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.