ETV Bharat / bharat

'ఆయనకు పిల్లలు లేరు.. ఈయనకు ఉన్నా...'.. మోదీపై లాలూ సెటైర్

author img

By

Published : Feb 11, 2022, 7:12 PM IST

Lalu Modi Dynasty Politics: కుటుంబ రాజకీయాలను వ్యతిరేకిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై తనదైన శైలిలో స్పందించారు ఆర్​జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్. మోదీతో పాటు, బిహార్ సీఎం నితీశ్ కుమార్​కు రాజకీయ వారసులు లభించాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

Lalu Modi Dynasty Politics
Lalu Modi Dynasty Politics

Lalu Modi Dynasty Politics: కుటుంబ రాజకీయాలను విమర్శిస్తూ.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలపై బిహార్ రాజకీయ దిగ్గజం, ఆర్​జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. ఆయనకు రాజకీయ వారసత్వం లభించాలనే ప్రార్థిస్తున్నానని అన్నారు. మీడియాతో మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారూ లాలూ.

"మోదీకి పిల్లలు లేరు. నితీశ్ కుమార్​కు కొడుకు ఉన్నా.. ఆయనకు రాజకీయాలపై ఆసక్తి లేదు. వారిద్దరికి రాజకీయ వారసులు లభించాలనే నేను ప్రార్థిస్తున్నా."

-లాలూ ప్రసాద్ యాదవ్, ఆర్​జేడీ అధినేత

లాలూ కుమారుడు, బిహార్ ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ సైతం మోదీ, నితీశ్ కుమార్​లపై విరుచుకుపడ్డారు. ఒకప్పుడు ఈ నేతలిద్దరూ ఒకరినొకరు విమర్శించుకునేవారని గుర్తు చేశారు. అధికారం కోసం మనసు మార్చుకొని కలిసి ఉన్నారని ఆరోపించారు.

హిమంత అనుచిత వ్యాఖ్యలు

మరోవైపు, అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. సర్జికల్ స్ట్రైక్స్​కు రాహుల్ గాంధీ రుజువులు అడిగారని, మరి ఆయన తన తండ్రికే పుట్టారనేందుకు సాక్ష్యం ఏంటని ప్రశ్నించారు. ఉత్తరాఖండ్​లో ఎన్నికలు ప్రచారంలో పాల్గొన్న ఆయన.. ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇదీ చదవండి: యూపీలో సంకీర్ణం తప్పదా? తొలి దశ పోలింగ్ ఏం చెబుతోంది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.