ETV Bharat / bharat

రామయ్య చెంతకు 108అడుగుల అగరుబత్తి- శ్రీకృష్ణ జన్మస్థానం నుంచి వెయ్యి కిలోల లడ్డూలు

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 16, 2024, 3:34 PM IST

Ayodhya Ram Mandir Pran Pratishtha : అయోధ్య రాముడికి గుజరాత్‌ భక్తులు కానుకగా పంపిన 108 అడుగుల బాహుబలి అగరుబత్తిని వెలిగించారు. పంచ ద్రవ్యాలతో 5 లక్షల రూపాయల వ్యయంతో ఈ అగరుబత్తిని తయారు చేశారు. మరోవైపు 56 రకాల ప్రాచీన్‌ పేటా ఆగ్రా నుంచి ఓ వాహనంలో అయోధ్యకు చేరుకున్నాయి.

Ayodhya Ram Mandir Pran Pratishtha
Ayodhya Ram Mandir Pran Pratishtha

Ayodhya Ram Mandir Pran Pratishtha : అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు సమయం దగ్గరపడుతున్న వేళ దేశవ్యాప్తంగా భక్తులు పంపిన కానుకలు అయోధ్యకు చేరుకుంటున్నాయి. గుజరాత్‌లోని వడోదర నుంచి వచ్చిన 108 అడుగుల పొడవు, 3వేల 403 కిలోల బరువైన బాహుబలి అగరుబత్తిని అయోధ్యలో వెలిగించారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ అధ్యక్షుడు మహంత్ నృత్యగోపాల్ దాస్ జీ మహారాజ్ సమక్షంలో ఈ బాహుబలి అగరుబత్తిని భక్తులు వెలిగించారు. గుజరాత్‌లోని వడోదరా నగర తర్సాలీ ప్రాంతానికి చెందిన కొందరు భక్తులు అయోధ్య రామమందిరం కోసం బాహుబలి అగరుబత్తిని తయారుచేశారు.

  • #WATCH | The 108-feet incense stick, that reached from Gujarat, was lit in the presence of Shri Ram Janmabhoomi Teerth Kshetra President Mahant Nrityagopal Das ji Maharaj pic.twitter.com/ftQZBgjaXt

    — ANI (@ANI) January 16, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఈ బాహుబలి అగరుబత్తిని పంచ ద్రవ్యాలతో తయారుచేశారు. 3.5 అడుగుల చుట్టుకొలత ఉన్న దీని తయారీకి దాదాపు రెండు నెలల సమయం పట్టింది. 191 కిలోల ఆవునెయ్యి, 376 కిలోల గుగ్గిలం పొడి, 280 కిలోల బార్లీ, 280 కిలోల నువ్వులు, 376 కిలోల కొబ్బరిపొడి, 425 కిలోల పూర్ణాహుతి సామగ్రి, 1,475 కిలోల ఆవుపేడను దీని తయారీకి వాడారు. ఇందుకు దాదాపుగా 5 లక్షల రూపాయల ఖర్చయింది.

రాముడి కోసం వెండి పూజా సామగ్రి
అయోధ్య రామ మందిరంలో రాముల వారి పూజ కోసం వెండితో పూజా సామగ్రిని తయారు చేశారు. స్వచ్ఛమైన వెండితో వీటిని చెన్నైకు చెందిన ఆభరణాల సంస్థ రూపొందించింది. రామ మందిరంలో రోజువారీ పూజా కార్యక్రమాల్లో భాగంగా వీటిని ఉపయోగించనున్నారు.

శ్రీ కృష్ణ జన్మస్థానం నుంచి 1000కిలోల లడ్డూలు
మరోవైపు 56 రకాల ప్రాచీన్‌ పేటా ఆగ్రా నుంచి ఓ వాహనంలో అయోధ్యకు చేరుకున్నాయి. దీంతో పాటు శ్రీ కృష్ణ జన్మస్థానమైన మథుర నుంచి 1000 కిలోల లడ్డూలు సైతం అయోధ్యకు చేరాయి.
మరోవైపు, గుజరాత్ సూరత్​కు చెందిన ఓ భక్తుడు తన కారును రామ్​ థీమ్​తో రూపొందించాడు. అయోధ్య ఆలయంతో పాటు రాముడి చిత్రాలను కారుపై ముద్రించి సుందరంగా అలంకరించాడు.

ayodhya ram mandir pran pratishtha
రాముడి థీమ్​తో రూపొందించిన కారు
ayodhya ram mandir pran pratishtha
రాముడి థీమ్​తో రూపొందించిన కారు

రామాలయం కోసం 400కిలోల తాళం
అయోధ్య రామాలయం కోసం 400 కిలోల బరువైన తాళాన్ని తయారు చేస్తున్నారు అలీగఢ్​కు చెందిన దంపతులు. ఇందుకోసం సుమారు రూ. 2లక్షలు వెచ్చిస్తున్నారు. ఇటీవలె ఆమె భర్త చనిపోగా, ఆయన కోరిక మేరకు రాముడికి అందిస్తామని భార్య రుక్మిణీ దేవి. ప్రస్తుతం పనులు చివరి దశలో ఉన్నాయని, పూర్తి కాగానే అయోధ్యకు వెళ్లి ఇస్తామని అమె చెప్పారు.

ayodhya ram mandir pran pratishtha
రాముడికి అందించనున్న తాళంచెవి

అయోధ్య గుడిలో రాముడి విగ్రహం చూశారా? విల్లుతో కమలం పువ్వుపై కొలువుదీరిన రామ్​లల్లా

అయోధ్యలో టెంట్​ సిటీ సిద్ధం - ప్రముఖుల కోసం స్పెషల్ కాటేజీలు - ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.