ETV Bharat / bharat

ఉద్యోగులకు గుడ్​న్యూస్​- అయోధ్య గుడి ప్రాణప్రతిష్ఠ రోజున హాఫ్​ డే లీవ్

author img

By PTI

Published : Jan 18, 2024, 3:18 PM IST

Updated : Jan 18, 2024, 10:20 PM IST

Ayodhya Ram Mandir Opening Leave : అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఉద్యోగులకు కేంద్రం గుడ్​ న్యూస్ చెప్పింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అన్ని కార్యాలయాలకు జనవరి 22న సగం రోజు సెలవును ప్రకటించింది.

ayodhya ram mandir opening leave
ayodhya ram mandir opening leave

Ayodhya Ram Mandir Opening Leave : అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో కేంద్రం గుడ్​ న్యూస్ చెప్పింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అన్ని కార్యాలయాలకు జనవరి 22న సగం రోజు సెలవును ప్రకటించింది. మధ్యాహ్నం 2.30 గంటల వరకే కార్యాలయాలను నడుస్తాయని వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం ప్రాణప్రతిష్ఠ వేడుకల్లో ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొనేలా చేస్తుందని తెలిపింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలో నడిచే కార్యాలయాలు, సంస్థలు, పరిశ్రమలకు ఇది వర్తిస్తుందని చెప్పింది. ప్రాణప్రతిష్ఠ రోజున సగం రోజు సెలవు ప్రకటించడంపై కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ జితేంద్ర సింగ్ స్పందించారు. ప్రజల విశ్వాసాలను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా సెలవు ఇవ్వాలని అనేక విజ్ఞప్తులు వచ్చాయని ఆయన వివరించారు. మరోవైపు ప్రభుత్వ, ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఈనెల 22న సగం రోజు సెలవు ప్రకటించింది కేంద్ర ఆర్థిక శాఖ. ఎస్‌బీఐ సహా ప్రభుత్వ రంగ బ్యాంకులకు సర్కులర్ జారీ చేసింది.

  • Central Government announces half day closing till 2:30 pm on 22nd January 2024, at all Central Government offices, Central institutions and Central industrial establishments throughout India on the occasion of Ram Temple pranpratishtha ceremony. pic.twitter.com/hAg2ezLwcy

    — ANI (@ANI) January 18, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అనేక రాష్ట్రాల్లో సెలవు
ఇప్పటికే దేశంలోని అనేక రాష్ట్రాలు ప్రాణప్రతిష్ఠ జరిగే జనవరి 22ను సెలవు దినంగా ప్రకటించాయి. ఉత్తర్​ప్రదేశ్​, గోవా, మధ్యప్రదేశ్​, హరియాణా, ఛత్తీస్​గఢ్​ రాష్ట్రాలు సెలవు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. మరోవైపు జనవరి 22ను జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్​ షాకు ఓ న్యాయవాది లేఖ రాశారు.

రామాలయ స్టాంపును రిలీజ్​ చేసిన మోదీ
అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ రామాలయ స్టాంపును విడుదల చేశారు. దీంతో పాటు వినాయకుడు, హనుమంతుడు, జటాయువు, శబరి, కెవత్రాజ్‌ స్టాంపులనూ కలిపి మొత్తంగా ఆరు స్టాంపులను ప్రధాని విడుదల చేశారు. వీటిని పంచభూతాలు ప్రతిబింబించే విధంగా సూర్యుని కిరణాలు, సరయూనదీ జలం, అయోధ్య వాతావరణంలోని మట్టిని వినియోగించి, సువాసనలు వెదజల్లే విధంగా చందనంతో తయారు చేసినట్లు పేర్కొన్నారు. వీటితో పాటు ప్రపంచవ్యాప్తంగా 20 దేశాల్లో ఉన్న రాముని చిత్రాలతో తయారు చేసిన స్టాంపులతో నిండిన 48 పేజీల పుస్తకాన్ని ఈ సందర్భంగా ప్రధాని మోదీ విడుదల చేశారు. ఈ పుస్తకంలో అమెరికా, న్యూజిలాండ్‌, సింగపూర్‌, కెనడా వంటి ప్రముఖ దేశాలకు చెందిన రామచంద్రుడి స్టాంపులు ఉన్నాయి.

ayodhya ram mandir stamps
స్టాంపులు విడుదల చేసిన ప్రధాని మోదీ
ayodhya ram mandir stamps
స్టాంపులు విడుదల చేసిన ప్రధాని మోదీ

అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం - సెలవు ప్రకటించిన రాష్ట్రాలివే!

గర్భగుడిలో అయోధ్య రాముడి విగ్రహం- వేద మంత్రాల మధ్య జలాభిషేకం!

Last Updated : Jan 18, 2024, 10:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.