ETV Bharat / bharat

రామమందిరం ఓపెనింగ్​కు 10కోట్ల కుటుంబాలకు ఆహ్వానం- విదేశాల్లోని హిందువులకు కూడా!

author img

By PTI

Published : Nov 13, 2023, 10:45 PM IST

Ayodhya Ram Mandir Opening Invitation : అయోధ్యలో శరవేగంగా నిర్మాణం జరుగుతున్న రామ మందిర ప్రారంభోత్సవానికి 10 కోట్ల కుటుంబాలను ఆహ్వానించనున్నట్లు విశ్వహిందూ పరిషత్‌ ప్రకటించింది. ఆహ్వాన పత్రికతో పాటు ప్రతి కుటుంబానికి రాముడు, అయోధ్య మందిర చిత్రాలను అందించనున్నట్లు వెల్లడించింది.

Ayodhya Ram Mandir Opening Invitation
Ayodhya Ram Mandir Opening Invitation

Ayodhya Ram Mandir Opening Invitation : ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిర ప్రారంభోత్సవానికి శుభ ముహూర్తం సమీపిస్తోంది. వచ్చే ఏడాది జనవరి 22న నిర్వహించనున్న ఈ మహత్తర కార్యక్రమానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీకి ఇప్పటికే ఆహ్వానం అందింది. అయితే శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ పిలుపు మేరకు ఈ వేడుక కోసం.. దేశ, విదేశాల్లోని 10 కోట్లకుపైగా కుటుంబాలను ఆహ్వానించనున్నట్లు విశ్వహిందూ పరిషత్‌ వెల్లడించింది.

  • Press Statement:
    Shri Ram Janmabhoomi invitation to more than 10 crore families of the globe: @AlokKumarLIVE

    New Delhi. November 13, 2023. Vishwa Hindu Parishad's Central working President and senior advocate Shri Alok Kumar today said that, on the call of Shri Ram Janmabhoomi… pic.twitter.com/ibE3GxP0ay

    — Vishva Hindu Parishad -VHP (@VHPDigital) November 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"జనవరి 22వ తేదీన అయోధ్య రామ మందిరంలో జరిగే ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొనేందుకు 10 కోట్ల కుటుంబాలను ఆహ్వానించనున్నాం. ఇతర హిందూ సంస్థలతో కలిసి వీహెచ్​పీ కార్యకర్తలు.. జనవరి 1 నుంచి 15 వరకు దేశంలోని వివిధ నగరాలు, గ్రామాలకు వెళ్లి కుటుంబాలను ఆహ్వానించనున్నారు. ఆహ్వాన పత్రికతో పాటు ప్రతి కుటుంబానికి రాముడు, అయోధ్య మందిర చిత్రాన్ని అందించనున్నాం. ఆ సమయంలో భక్తుల నుంచి ఎలాంటి విరాళం, సామగ్రి స్వీకరించబోం. విదేశాల్లో నివసిస్తున్న హిందువులను మరో కార్యక్రమం ద్వారా ఆహ్వానిస్తాం" అని విశ్వ హిందూ పరిషత్ వర్కింగ్​ ప్రెసిడెంట్​ అలోక్​ కుమార్​ తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా 5 లక్షలకుపైగా దేవాలయాల్లో..
Ayodhya Ram Mandir Opening Date : మరోవైపు.. పవిత్ర 'అక్షత కలశం'తో కూడిన దేశవ్యాప్త యాత్ర అయోధ్య నుంచి ఇప్పటికే ప్రారంభమైందని అలోక్​ కుమార్​ తెలిపారు. జనవరి 22వ తేదీన.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులంతా తమ సమీప దేవాలయాల్లో గుమిగూడి పూజలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా 5 లక్షలకుపైగా దేవాలయాల్లో ఈ వేడుకలు జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామని అన్నారు. ఆ రోజు అయోధ్యలో జరిగే మహాభిషేక కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తామని తెలిపారు. ఆ చారిత్రక ఘట్టాన్ని ప్రజలంతా ఆస్వాదించాలని కోరారు.

  • श्री राम के स्वागत हेतु आतुर श्री राम जन्मभूमि

    शुभ दीपावली
    Shubh Deepawali pic.twitter.com/kgQRij6fqq

    — Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) November 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'ప్రపంచం రెండో దీపావళి చేసుకుంటుంది'
దాదాపు 500 ఏళ్ల తర్వాత.. స్వతంత్ర భారత అమృతోత్సవాల వేళ శ్రీరాముడు తన జన్మస్థలానికి తిరిగి రానున్న రోజు.. ప్రపంచం రెండో దీపావళి చేసుకుంటుందని అలోక్​ కుమార్​ తెలిపారు. రామజన్మభూమి ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన వారి కుటుంబసభ్యుల రామ మందిర సందర్శన కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆయన చెప్పారు. వచ్చే ఏడాది జనవరి 27 నుంచి ఫిబ్రవరి 22 వరకు దాదాపు లక్షలాది మందికి దర్శనం కల్పిస్తామని చెప్పారు. జనవరి 22వ తేదీన రాత్రి ప్రతి ఇంటి ముందు ఐదు దీపాలు వెలిగించాలని పిలుపునిచ్చారు. ఆ తర్వాత ఏదైనా రోజు.. కుటుంబం లేదా స్నేహితులతో అయోధ్యను సందర్శించాలని కోరారు.

గ్రౌండ్​ ఫ్లోర్​లో బాల 'రాముడు'- అయోధ్యలో శబరికి ప్రత్యేక ఆలయం, దర్శనానికి కోటి మంది భక్తులు!

15 వేల మంది బస చేసేలా అయోధ్యలో టెంట్ సిటీ, మూడు పూటలా ఆహారం, భాష సమస్య లేకుండా ఏర్పాట్లు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.