ETV Bharat / bharat

శ్రీరంగం ఆలయంలో ఏపీకి చెందిన అయ్యప్ప భక్తులపై దాడి

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 12, 2023, 7:36 PM IST

Updated : Dec 12, 2023, 7:49 PM IST

Attack on AP Ayyappa Devotees in Srirangam Temple: శ్రీరంగం ఆలయం 108 వైష్ణవ ఆలయాలలో అగ్రగామిగా ఉంది. భూలోక వైకుంఠంగా పేరుగాంచిన ప్రసిద్ద ఆలయం ఇది. శ్రీరంగం ఆలయానికి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు తమిళనాడు నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వస్తుంటారు. ఈ రోజు శ్రీరంగం ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉదయాన్నే వేలాది మంది భక్తులు రంగనాథుడిని దర్శించుకునేందుకు తరలివచ్చారు. ఈ వేడుకలో ఆంధ్రాకు చెందిన అయ్యప్ప భక్తులు, ఆలయ నిర్వాహకులు నియమించిన తాత్కాలిక సిబ్బంది మధ్య వాగ్వాదం జరిగింది.

tamilanadu_srirangam_sriranganata_temple_issue
tamilanadu_srirangam_sriranganata_temple_issue

Attack on AP Ayyappa Devotees in Srirangam Temple : తమిళనాడులోని తిరుచ్చి జిల్లా శ్రీరంగం శ్రీరంగనాథ ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలకు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన​ భక్తులు తరలివచ్చారు. ఆంధ్రప్రదేశ్​కు చెందిన అయ్యప్ప భక్తులకు, ఆలయంలోని తాత్కాలికంగా నియమితులైన సిబ్బంది మధ్య వివాదం చోటు చేసుకుంది. దీంతో తొక్కిసలాట జరిగింది. సిబ్బంది దాడిలో ఆంధ్రా అయ్యప్ప మాలదారి చెన్నారావుతో సహా పలువురు గాయపడ్డారు.

శ్రీరంగం ఆలయంలో ఏపీకి చెందిన అయ్యప్ప భక్తులపై దాడి

శ్రీరంగనాథ స్వామి ఆలయ కమిటీ అధ్యక్షునిగా శ్రీధర్ రెడ్డి ప్రమాణస్వీకారం

AP Ayyappa Swamulapai Dadi In Trichy : దాడికి గురైన అయ్యప్ప భక్తులను చికిత్స నిమిత్తం శ్రీరంగం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆలయంలో ఉన్న పోలీసులు దాడికి దిగిన ఆలయ సిబ్బందికి మద్దతుగా నిలిచి తమను ఆలయం నుంచి బయటకు పంపారని బాధితులు ఆరోపించారు. పోలీసులు దాడిని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించారని కార్తీక గోపురం, ధ్వజస్తంభం తదితర ప్రాంతాల్లో వంద మందికి పైగా అయ్యప్ప భక్తులు నిరసన తెలిపారు. ఆందోళన చేస్తున్న అయ్యప్ప భక్తులను పోలీసులు అడ్డుకున్నారు. ఆలయ ప్రాంగణం అంతా పోలీస్​ డౌన్​ డౌన్​ అనే నినాదాలతో మారుమోగింది. ఈ ఘటనతో శ్రీరంగం రంగనాథుని ఆలయంలో అలజడి నెలకొంది. ఇందుకు సంబంధించిన వీడియో ఫుటేజీ భక్తుల్లో కలకలం రేపుతోంది. తమపై దాడి చేసిన తాత్కాలిక ఉద్యోగులు సెల్వం, విఘ్నేష్, భరత్‌లపై చర్యలు తీసుకోవాలని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Vaikunta Ekadashi in Srirangam Sriranganata Temple : ఈ ఘటనను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఖండించారు. దీనికి సంబంధించి తన సోషల్ మీడియా పేజీలో “హిందూ ధర్మంపై నమ్మకం లేని ప్రభుత్వం హిందూ దేవాలయాల్లో ఉండకూడదని పెట్టారు. 42 రోజుల పాటు ఉపవాస దీక్ష చేసిన అయ్యప్ప భక్తులు శబరిమల నుంచి తిరిగి వచ్చిన తర్వాత రంగనాథుడిని దర్శించుకోవడం సంప్రదాయం. వారిపై చేయి చేసుకోవడం దారుణమని పేర్కొన్నారు.

అయ్యప్ప పడిపూజను అడ్డుకున్న పోలీసులు.. కారణం ఏంటంటే??

Srirangam Sriranganata Temple Latest update : ఈ నేపథ్యంలో ఆలయ పాలకవర్గం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఈరోజు ఉదయం ఏడు గంటల సమయంలో ఆంధ్రాకు చెందిన 34 మంది శ్రీరంగం గాయత్రీ మండపంలో భక్తుల వరుసలో నిలబడి పెద్ద శబ్దంతో గాయత్రీ మండపంలో గంటను కొట్టారు. శబ్దం చేస్తుండగా ఆపేందుకు ఆలయ కార్యకర్త ప్రయత్నించాడు. దాంతో అక్కడ తోపులాట జరిగింది. భక్తులు 'పోలీసులు డౌన్ డౌన్' అని అరిచారు. ఇతర భక్తులు ఎవరినీ దర్శనానికి అనుమతించకపోవడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకున్నారు. శ్రీరంగం రంగనాథ స్వామి ఆలయాన్ని అపవిత్రం చేసే వారిపై చర్యలు తీసుకోవాలని తిరుచ్చి జిల్లా యూనిట్ ఆలయం వెలుపల నిరసన చేపట్టనున్నట్టు తెలిపింది.

Last Updated : Dec 12, 2023, 7:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.