కారు ఆపిన ట్రాఫిక్​ ​పోలీస్​ను కిడ్నాప్​ చేసిన దొంగ

author img

By

Published : Oct 19, 2021, 5:45 PM IST

Traffic Police Kidnapped

కారు పత్రాలు చూపించాలని అడిగిన ట్రాఫిక్ కానిస్టేబుల్​నే కిడ్నాప్(Traffic Police Kidnapped) చేశాడు ఓ వ్యక్తి. కారులోకి ఎక్కితే పత్రాలు చూపిస్తానని చెప్పి, పది కిలోమీటర్ల దూరం తీసుకువెళ్లి వదిలేశాడు. ఈ కేసులో నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు.

ఉత్తర్​ప్రదేశ్​ గ్రేటర్​ నోయిడాలో(Uttar Pradesh Greater Noida) ఓ వ్యక్తి దుస్సాహసం చేశాడు. కారు పత్రాలు చూపించాలని, ఆపిన ఓ ట్రాఫిక్​ పోలీసునే(Traffic Police Kidnapped) అపహరించాడు. పది కిలోమీటర్ల దూరం కారులో కానిస్టేబుల్​ను తీసుకెళ్లి వదిలేశాడు. ఈ కేసులో నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు.

అసలేం జరిగిందంటే..?

గ్రేటర్ నోయిడా పరిధిలోని ఘోది బచేదా గ్రామానికి చెందిన సచిన్ రావల్​.. హరియాణా గుడ్​గావ్​లోని ఓ కారు షోరూం నుంచి మారుతీ స్విఫ్ట్ డిజైర్ కారును రెండేళ్ల క్రితం దొంగిలించాడు. టెస్ట్ డ్రైవ్ చేస్తానని షోరూం నిర్వాహుకులను నమ్మించి కారుతో సహా పరారయ్యాడు. తన గ్రామానికే చెందిన మరో వ్యక్తి కారు నంబర్​తో నకిలీ నంబర్ ప్లేట్​ చేయించి, దొంగిలించిన కారును అతడు నడుపుతున్నాడు.

ఆదివారం ఉదయం.. సూరజ్​పుర్​లో ట్రాఫిక్​ పోలీసులు చెకింగ్ క్యాంపెయిన్ ఏర్పాటు చేశారు. అక్కడ రావల్​ కారును పోలీసులు ఆపారు. అతడ్ని కారు పత్రాలు చూపించాలని ట్రాఫిక్​ కానిస్టేబుల్ వీరేంద్ర సింగ్​ అడిగాడు. అయితే.. తన మొబైల్ ఫోన్లో వాటి సాఫ్ట్ కాపీస్ ఉన్నాయని రావల్​ చెప్పాడు. వాటిని చూసేందుకు కారులోకి ఎక్కాలని కానిస్టేబుల్​ను కోరాడు. కారులోకి ఎక్కిన వెంటనే.. కారు డోర్లు లాక్ చేసి, అతడు దూసుకెళ్లాడు(Traffic Police Kidnapped). అజయాబ్​పుర్​ పోలీస్​ చౌకి ప్రాంతంలో వీరేంద్ర సింగ్​ను దింపేసి పరారయ్యాడు. ఈ మేరకు పోలీసులు వివరించారు.

సోమవారం నిందితుడ్ని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అతనిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అతడి వద్ద ఉన్న కారును కూడా స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి: బుర్ఖా ధరించారని రెస్టారెంట్​లోకి నో ఎంట్రీ- నెటిజన్ల గుస్సా

ఇదీ చూడండి: ఫేక్ సర్టిఫికేట్​తో అడ్మిషన్- ఎమ్మెల్యేకు ఐదేళ్ల జైలు శిక్ష

ఇదీ చూడండి: 'కుర్రాళ్లంతా మందు కొడతారు.. అయితే ఏంటి?'- ఠాణాలో ఎమ్మెల్యే ధర్నా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.