ETV Bharat / bharat

బుర్ఖా ధరించారని రెస్టారెంట్​లోకి నో ఎంట్రీ- నెటిజన్ల గుస్సా

author img

By

Published : Oct 19, 2021, 4:36 PM IST

hijab condition in restaurant
రెస్టో బార్ ట్యాప్​

ముంబయిలోని 'రెస్టో బార్ ట్యాప్'(Tap Resto Bar) ఉద్యోగుల తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిజాబ్(బుర్ఖా)​ ధరించిందన్న కారణంతో ఓ మహిళను తమ రెస్టారెంట్​లోకి అనుమతించకపోవడమే ఇందుకు కారణం. దీనికి సంబంధించిన వీడియో.. సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

బుర్ఖా ధరించి వచ్చిన మహిళను లోపలకు అనుమతించని రెస్టారెంట్ ఉద్యోగులు

మహారాష్ట్ర దక్షిణ ముంబయిలోని(Maharashtra Mumbai news) వర్లీ ప్రాంతంలో 'రెస్టో బార్ ట్యాప్​'(Tap Resto Bar) ఉద్యోగులు అనుచితంగా ప్రవర్తించారు. హిజాబ్(బుర్ఖా)(Hijab) ధరించి వచ్చిన ఓ మహిళను రెస్టారెంట్​లోకి అనుమతించలేదు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. రెండు నిమిషాల నిడివి ఉన్న ఆ వీడియోలో రెస్టారెంట్ ఉద్యోగులు.. 'హిజాబ్​ తొలగిస్తేనే లోపలకు అనుమతిస్తాం' అని చెప్పారు. 'చీరలు కట్టుకుని వచ్చిన వారిని కూడా తాము రెస్టారెంట్​లోకి అనుమతించబోం' అని అన్నారు.

"భారతీయ దుస్తులు వేసుకున్న వారికి రెస్టారెంట్లలోకి అనుమతి లేదు. భారతీయ దస్తులు వేసుకున్న వారికి భారత్​లోనే అనుమతి లేదు" అని సదరు మహిళ స్నేహితుడు.. రెస్టారెంట్ ఉద్యోగులతో తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. అయినప్పటికీ రెస్టారెంట్​ నిర్వాహకులు మాత్రం ఆ మహిళను లోపలకు అనుమతించలేదు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

"లౌకిక సమాజంలో ఇంకా ఇలాంటి నిబంధనలు ఉన్నాయని తెలుసుకుని చాలా ఆశ్చర్యపోయాను. హిజాబ్ ధరించిన కారణంగా... ఈ రోజు నా గర్ల్​ఫ్రెండ్​ను​ రెస్టారెంట్​లోకి అనుమతించలేదు. దాన్ని తొలగించి రావాలని అడిగారు. ఇది ఎంత మాత్రం సహించేది కాదు" అని సకినమైమున్ అనే వ్యక్తి ఇన్​స్టాగ్రామ్​లో ఈ వీడియోను షేర్​ చేశాడు.

ఇదీ చూడండి: 'కుర్రాళ్లంతా మందు కొడతారు.. అయితే ఏంటి?'- ఠాణాలో ఎమ్మెల్యే ధర్నా

ఇదీ చూడండి: ఫేక్ సర్టిఫికేట్​తో అడ్మిషన్- ఎమ్మెల్యేకు ఐదేళ్ల జైలు శిక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.