ETV Bharat / bharat

వెయిట్​ లిఫ్టింగ్​లో 8ఏళ్ల చిన్నారి భళా​.. 62 కేజీల బరువెత్తి.. గిన్నిస్​ రికార్డ్​ బద్దలు కొట్టిన 'అశ్రియా'..

author img

By

Published : Aug 12, 2023, 2:28 PM IST

Updated : Aug 12, 2023, 3:18 PM IST

Ashriya Goswami Youngest Weightlifter : హరియాణాకు చెందిన 8 ఏళ్ల అశ్రియా వెయిట్​ లిఫ్టింగ్​లో ప్రపంచ రికార్డు బద్దలు కొట్టింది. 62 కేజీల బరువెత్తి ఔరా అనిపించింది. 30 సెకన్లలో 17 సార్లు క్లీన్​ అండ్​ జర్క్​ వెయిట్​ లిఫ్టింగ్​ చేసి గిన్నిస్​ రికార్డ్​ నెలకొల్పింది.

Arshiya Goswami Youngest Weightlifter-broke-world-record india-got-talent tv show
వెయిట్ లిఫ్టర్ అశ్రియా గోస్వామి రికార్డులు

Ashriya Goswami Youngest Weightlifter : 8 ఏళ్ల వయసులో 62 కేజీల బరువెత్తి ప్రపంచ రికార్డు సృష్టించింది ఓ బాలిక. 'ఇండియాస్ గాట్ టాలెంట్'​షోలో 30 సెకన్లలో 17 సార్లు క్లీన్​ అండ్​ జర్క్​ వెయిట్​ లిఫ్టింగ్​ చేసి.. అప్పటి వరకు ఉన్న వరల్డ్​ రికార్డ్​ను బద్దలు కొట్టింది. చిన్న వయసులోనే శక్తికి మించిన సాహసాలు చేస్తూ ఔరా అనిపిస్తోంది హరియాణాకు చెందిన అశ్రియా గోస్వామి.

అశ్రియా గోస్వామి పంచకుల జిల్లాకు చెందిన చిన్నారి. ఆమె తల్లిదండ్రులు హన్ని, అవినాష్​ కుమార్. వీరు సెక్టార్​ 29లో నివాసం ఉంటున్నారు. అవినాష్​ కుమార్​ స్థానికంగా ఓ జిమ్​ సెంటర్​ నడుపుతున్నాడు. అశ్రియా బ్రైట్​ స్కూల్​లో​ చదువుకుంటోంది. మొదట్లో తన తండ్రి దగ్గరే వెయిట్​ లిఫ్టింగ్​ ట్రైయిన్​ తీసుకునేది అశ్రియా. తండ్రితో పాటే జిమ్​కు వెళ్లి.. బరువులు ఎత్తడం సాధన చేసేది. ఆమెలోని శక్తిని గుర్తించిన తండ్రి అవినాష్​.. కూతురిని వెయిట్​ లిఫ్టింగ్​ వైపుగా ప్రోత్సహించాడు. ప్రస్తుతం అంతర్జాతీయ వెయిట్ లిఫ్టర్ గుర్మెల్ సింగ్ వద్ద శిక్షణ తీసుకుంటోంది చిన్నారి.

Arshiya Goswami Youngest Weightlifter-broke-world-record india-got-talent tv show
వెయిట్ లిఫ్టర్ అశ్రియా గోస్వామి రికార్డులు

ఇటీవల జులైలో జరిగిన ప్రముఖ టీవీ షో కార్యక్రమం.. 'ఇండియాస్ గాట్ టాలెంట్​'షోలో 62 కేజీల బరువును ఎత్తి రికార్డు సృష్టించింది అశ్రియా. 30 సెకన్లలో 17 సార్లు క్లీన్​ అండ్​ జర్క్​ చేసి గిన్నిస్​ రికార్డ్​ నెలకొల్పింది. అంతకుముందు ఈ రికార్డ్.. 30 సెకన్లలో 16 సార్లు ఉండేది. స్నాచ్ వెయిట్ లిఫ్టింగ్​లో 26 కేజీలు, స్కాట్‌ వెయిట్ లిఫ్టింగ్​లో 47 కిలోలు, బెంచ్ ప్రెస్‌లో 32 కిలోల బరువులు ఎత్తి పలు ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టింది. భవిష్యత్తులో మరిన్ని రికార్డ్​లు బ్రేక్​ చేయడమే తన లక్ష్యమని అశ్రియా చెబుతోంది. అంతకుముందు ఆరేళ్ల వయసులో ఉన్నప్పుడు 45 కేజీల బరువెత్తి.. ఇండియా బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో​ చోటు సంపాదించింది. 2022లో 35.8 కేజీల వెయిట్​ లిఫ్టింగ్​ చేసి.. ఆసియా బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో స్థానం కైవసం చేసుకుంది.

Arshiya Goswami Youngest Weightlifter-broke-world-record india-got-talent tv show
వెయిట్ లిఫ్టర్ అశ్రియా గోస్వామి రికార్డులు

కాగా శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి హరియాణా అసెంబ్లీ స్పీకర్​ జ్ఞాన్‌చంద్ గుప్తాను కలిసింది అశ్రియా. ఆమె సాధించిన విజయాల పట్ల చిన్నారికి అభినందనలు తెలిపిన స్పీకర్ జ్ఞాన్‌చంద్​​.. అనంతరం అశ్రియాను ఘనంగా సన్మానించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు ఆమె అందుకోవాలని ఆకాక్షించారు. 'ఇండియాస్ గాట్ టాలెంట్​'షోలో అశ్రియ ప్రదర్శనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

రెండు చేతులతో వేర్వేరు భాషలు రాస్తున్న యువతి.. ప్రపంచ రికార్డులు దాసోహం

27వేల మంది మహిళల గర్భాశయాలు తొలగింపు.. వారికి తెలియకుండానే.. ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్!

Last Updated :Aug 12, 2023, 3:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.