ETV Bharat / bharat

రహస్య సమాచారం లీక్.. ఆర్మీ అధికారి అరెస్ట్!

author img

By

Published : Nov 16, 2021, 1:44 AM IST

పుణెలోని ఆర్మీ మెడికల్ కాలేజ్​ యూనిట్​లో పోస్టింగ్​ పొందిన ఓ జవాన్​ను అరెస్టు చేశారు పట్నా(patna news today) పోలీసులు. పాక్​కు చెందిన ఓ వ్యక్తితో రహస్య సమాచారం పంచుకున్నాడన్న అనుమానం నేపథ్యంలో అధికారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

army
ఆర్మీ

పుణెలోని ఆర్డ్మ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్​లో(ఏఎఫ్​ఎమ్​సీ) పోస్టింగ్​ పొందిన ఓ ఆర్మీ జవాన్​ను అరెస్టు చేశారు పోలీసులు. పాకిస్థాన్​కు చెందిన ఓ వ్యక్తితో రహస్య సమాచారం పంచుకున్నట్లు తెలిసిన కారణంగా అతడిని పట్నా దానాపుర్​ పోలీసులు(patna news today) అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆ జవాన్​పై అధికార రహస్యాల చట్టం(ఒఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్​) కింద కేసు నమోదు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి పేర్కొన్నారు.

"పుణెలో పోస్టింగ్​ పొందిన ఆర్మీ అధికారి పాకిస్థాన్​కు చెందిన ఓ వ్యక్తితో రహస్య సమాచారం పంచుకున్నట్లు సమాచారం అందింది. తమ ఆర్మీ యూనిట్​కు సంబంధించిన విషయాలు కూడా పాక్​ వ్యక్తితో పంచుకున్నట్లు తెలిసింది." అని దానాపుర్ ఏఎస్పీ సయ్యద్ ఇమ్రాన్ మసూద్ తెలిపారు.

అధికారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభినట్లు మసూద్ పేర్కొన్నారు. సెల్​ ఫోన్​ డేటాను కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి:

భద్రతా ఏజెన్సీల చీఫ్ పదవీకాలం పొడిగింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.