ETV Bharat / bharat

Another Leopard Caught at Tirumala తిరుమలలో ఎట్టకేలకు చిక్కిన మరో చిరుత.. రెండు నెలల వ్యవధిలో నాలుగు పట్టివేత

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 28, 2023, 10:28 AM IST

Another Leopard Caught at Tirumala : తిరుమలలో ఎట్టకేలకు మరో చిరుత బోనులో చిక్కింది. వారం రోజులుగా అటవీశాఖ అధికారులు ప్రయత్నిస్తున్నా.. చిరుత చిక్కలేదు. బోను వరకూ వచ్చి వెనుతిరుగుతుండేది. బంధించిన చిరుతను తిరుమల జూపార్క్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు.

Another cheetah Caught at Tirumala Alipiri Footpath
Another cheetah Caught at Tirumala Alipiri Footpath

Another Leopard Caught at Tirumala తిరుమలలో మరో చిరుత బోనులో చిక్కింది. అలిపిరి కాల నడక మార్గంలో ఏడో నంబర్‌ మైలు ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం వద్ద అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కినట్లు తితిదే అధికారులు తెలిపారు. దాదాపు రెండు నెలల వ్యవధిలో నాలుగు చిరుతలను అటవీశాఖ అధికారులు బంధించారు. చిరుతలను పట్టుకునేందుకు పలు మార్గాల్లో బోన్లను తితిదే ఏర్పాటు చేసింది. తొలుత ఒక చిరుతను బంధించగా.. ఆ తర్వాత మరో రెండు చిరుతలు, ఇప్పుడు మరొకటి బోనులో చిక్కింది.

Fourth Leopard Trapped in Cage: ప్రస్తుతం చిక్కిన నాలుగో చిరుతను బంధించేందుకు గత వారం రోజులుగా అటవీశాఖ అధికారులు ప్రయత్నాలు చేశారు. రోజూ బోను వరకు వచ్చి చిరుత వెనుదిరుగుతున్నట్లు అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో గుర్తించారు. ఈ క్రమంలో ఎట్టకేలకు ఆదివారం రాత్రి బోనులో చిక్కినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.

Operation Chirutha in Tirumala: తిరుపతిలో 'ఆపరేషన్​ చిరుత'.. మిగిలిన వాటి కోసం అన్వేషణ

ఇప్పటి వరకు అలిపిరి కాలిబాట సమీపంలో తిరుగుతున్న చిరుతలను బంధించామని, వర్షాల కారణంగా ఐదు రోజులుగా ఎలుగుబంటి సంచారం లేదని సీసీఎఫ్ (chief conservator of forest) నాగేశ్వర రావు తెలిపారు. శ్రీవారి మెట్లు, అలిపిరి కాలిబాటలో వచ్చే భక్తులకు ప్రమాదకరంగా తయారైన చిరుతలను బంధిస్తామన్నారు. కాలిబాటలో శాశ్వతంగా 500 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి వన్య ప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామన్నారు.

Cheetah Attacked Lakshitha in Tirumala: మరోవైపు కొద్ది రోజుల క్రితం చిరుత దాడిలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారి లక్షితపై దాడి చేసింది చిరుతేనని.. కానీ ఏ చిరుత అనేది ఇంకా తేలలేదని చెప్పారు. ఘటన స్థలంలో చిరుత వెంట్రికలు లభ్యమైందని, పట్టుకున్న చిరుతల్లో ఏది అనేది తేలలేదన్నారు. ఏ చిరుత దాడిచేసిందో వైద్యపరీక్షల నివేదికలో తెలుస్తుందని పేర్కొన్నారు.

Operation Chirutha in Tirumala: తిరుమలలో చిరుతల కోసం అన్వేషణ.. భక్తులకు కనిపించిన ఎలుగుబంటి

Tirumala Operation Cheetah: తిరుమల నడకమార్గాల్లో ఆపరేషన్ చిరుత కొనసాగుతోందని అన్నారు. భక్తుల భద్రతా దృష్ట్యా దీర్ఘకాలిక ప్రణాళిక చర్యలు తీసుకుంటామని తెలిపారు. నడకమార్గాల్లో, ఘాట్ రోడ్లలో ఆంక్షలు కొనసాగుతాయని అన్నారు. కెమెరా ట్రాప్‌లలో ప్రస్తుతానికి ఇంకే చిరుతలు కనబడలేదని చెప్పారు.

ప్రసుత్తం ఏడోవా మైలు ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం వద్ద అటవీ ప్రాంతంలో చిక్కిన చిరుతను తిరుపతి ఎస్వీ జూ పార్కుకు అటవీ శాఖ అధికారులు తరలించారు. చిరుత రక్త నమూనాలు సేకరించి డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. జూ క్వారంటైన్‌లో ఇటీవల పట్టుబడిన 2 చిరుతలు ఉన్నాయన్నారు.

Girl killed in Leopard Attack: తిరుమల నడకదారిలో తీవ్ర విషాదం.. చిన్నారి ప్రాణాన్ని బలిగొన్న చిరుత

Another Leopard Caught at Tirumala తిరుమలలో ఎట్టకేలకు చిక్కిన నాలుగో చిరుత
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.