ETV Bharat / bharat

'కొడుకు నాకు పుట్టలేదనేసరికి తట్టుకోలేకపోయా'.. అనాజ్​పూర్ జంట హత్యల కేసు నిందితుడు ధన్​రాజ్

author img

By

Published : Mar 17, 2023, 11:09 AM IST

husband killed his wife and baby case Update: భార్య అంటే భర్తలో సగం.. భర్త అంటే భార్యలో సగం అంటారు పెద్దలు. ఇరువురికి ఏ సమస్య వచ్చిన సామరస్యంగా దానిని సరిదిద్దుకోవాలే గానీ.. గొడవపడి వైవాహిక జీవితాలను నాశనం చేసుకోకూడదు. కోపంలో అన్న మాటలు మనసులో పెట్టుకుని జీవితాన్ని నరకం చేసుకోకూడదు. కానీ ఓ జంట కోపంలో గొడవ పడింది. ఈ క్రమంలో భార్య నోరు జారింది. ఆమె మాటలతో అనుమానం పెంచుకున్న భర్త చివరకు భార్యను, నెలన్నర వయసున్న కుమారుడిని కిరాతకంగా హత్య చేశాడు. రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన అనాజ్​పూర్ జంట హత్య కేసును దర్యాప్తు పోలీసులకు ఆసక్తికర విషయాలు తెలుస్తున్నాయి.

husband killed his wife and baby case
husband killed his wife and baby case

husband killed his wife and baby case Update: రంగారెడ్డి జిల్లాలో సంచలనంగా మారిన అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం అనాజ్‌పూర్‌లో భార్య లావణ్య, కుమారుడు క్రియాన్ష్‌(నెలన్నర)ను దారుణంగా హత్య చేసిన కేసులో భర్త ధన్‌రాజ్‌ను అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులు అరెస్టు చేశారు. హత్యకు గల కారణాలపై ధన్‌రాజ్‌ను విచారించిన పోలీసులు వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం హయత్‌నగర్‌ కోర్టులో హాజరుపర్చారు. అనంతరం నిందితుడికి 14 రోజుల రిమాండ్‌ విధించడంతో అతడిని పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు.

ఆ కేసుకు సంబంధించి పోలీసులు అందించిన తాజా వివరాలు ఇలా ఉన్నాయి..

సీన్​-1: భార్య లావణ్య, కుమార్తె ఆద్య, కుమారుడు క్రియాన్ష్‌ను బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలంబండరావిరాలలోని తన అత్తగారి ఇంటి నుంచి అనాజ్‌పూర్‌కి తీసుకురావడానికి వెళ్లాడు. తన కుమారుడు క్రియాన్ష్​కు సమయంలోనే ధనరాజ్​కు, భార్యకు కుటుంబ విషయాలపై గొడవ జరిగింది.

సీన్​-2: అనాజ్‌పూర్‌లోని తమ ఇంటికి చేరుకున్న అనంతరం ధనరాజ్ తన భార్య లావణ్యతో గొడవ పడ్డాడు. ఆ సమయంలో లావణ్య ధనరాజ్​ను దూషించి ఆవేశంలో.. 'అసలు క్రియాన్శ్ నీకు పుట్టలేదని' నోరు జారింది. ఈ మాటలు విన్న ధనరాజ్ అవమానం భరించలేకపోయాడు. ఆవేశం పట్టలేక బీరు సీసాలతో ఆమె ముఖంపై దాడి చేశాడు. దీంతో ఆమె.. కింద పడిపోవడంతో గదిలో ఉన్న గొడ్డలి తీసుకొని క్రూరంగా నరికేశాడు. అనంతరం అక్కడే ఉన్న బాబు క్రియాన్ష్‌ను గది బయట ఉన్న నీటి సంపులో పడేశాడు. ఇదంతా గమనించిన రెండేళ్ల పాప ఆద్య అక్కడి నుంచి భయంతో పారిపోయింది. ఇద్దరిని చంపిన తర్వాత ధనరాజ్​ అక్కడి నుంచి బైక్​పై పారిపోయాడు.

సీన్​-3: హత్య చేసిన అనంతరం సంఘీనగర్‌ మీదుగా ధన్‌రాజ్‌ కొహెడ ప్రాంతంలోని అవుటర్‌ రింగ్‌ రోడ్డుకు చేరుకొని సర్వీస్‌ రోడ్డు వెంట కొంత దూరం వెళ్లి.. చీకటి పడిన అనంతరం కోహెడ, తొర్రూర్‌ మీదుగా హయత్‌నగర్‌ చేరుకొని అక్కడి స్టేషన్​లో పోలీసుల ఎదుటలొంగిపోయాడు. దీంతో అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులు ధన్‌రాజ్‌ హయత్‌నగర్‌లో ఉన్నాడన్న సమాచారం తెలుసుకొని అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు.

సీన్​-4: పోలీసుల విచారణలో ధన్​రాజ్.. హత్యలు చేసిన అనంతరం భయపడి పారిపోయానని ఒప్పుకున్నాడు. తన భార్య అలా మాట్లాడటాన్ని భరించలేకనే ఈ ఘోరానికి పాల్పడినట్లు అంగీకరించాడు. తన భార్యపై తనకు ఎలాంటి అనుమానం లేదని అతడు వెల్లడించినట్లు విశ్వసనీయ సమాచారం.

ఇవీ చదవండి:

భార్యను గొడ్డలితో నరికి.. 42రోజుల శిశువును నీటి సంపులో పడేసి భర్త దారుణ హత్య

ఇద్దరమ్మాయిల ప్రేమాయణం.. మధ్యలో యువకుడి ఎంట్రీ.. కట్​ చేస్తే...

ఆన్​లైన్​లో వలపు వల.. చిక్కితే జీవితాలు విలవిల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.