ETV Bharat / bharat

DRDO అద్భుతం- ఒకేసారి 4లక్ష్యాలను ఢీకొట్టిన ఆకాశ్ మిస్సైల్ సిస్టమ్

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 18, 2023, 7:58 AM IST

Updated : Dec 18, 2023, 8:22 AM IST

Akash Missile 4 Targets : డీఆర్‌డీఓ అద్భుత విజయం సాధించింది. 25 కిలో మీటర్ల పరిధిలో దూసుకొస్తున్న 4 లక్ష్యాలను ఢీ కొట్టే సామర్థ్యాన్ని ప్రదర్శించింది. ఈ సామర్థ్యాన్ని ప్రదర్శించిన తొలి దేశంగా భారత్‌ అవతరించిందని తెలిపింది.

Akash Missile 4 Targets
Akash Missile 4 Targets

Akash Missile 4 Targets : రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ- డీఆర్​డీఓ రూపొందించిన ఆకాశ్‌ క్షిపణి వ్యవస్థ సరికొత్త అంచనాలను అందుకుంది. ఒకే ఫైరింగ్‌ యూనిట్‌ ద్వారా ప్రయోగించిన నాలుగు క్షిపణులు 25 కిలోమీటర్ల పరిధిలో దూసుకొస్తున్న నాలుగు లక్ష్యాలను ఏకకాలంలో ఢీ కొట్టేలా అభివృద్ధి చేసిన నూతన వ్యవస్థ విజయవంతమైనట్లు DRDO వెల్లడించింది. ఈ సామర్థ్యాన్ని ప్రదర్శించిన తొలి దేశంగా భారత్‌ అవతరించిందని సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో పోస్టు చేసింది.

  • #WATCH | Demonstration of Akash surface-to-air missile system’s capability to detect and take out four targets simultaneously at Indian Air Force exercise Astrashakti recently. The air defence missile system has been developed by Defence Research and Development Organisation:… pic.twitter.com/HMefrzQs7F

    — ANI (@ANI) December 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'సింగిల్ ఫైరింగ్ యూనిట్‌ని ఉపయోగించి కమాండ్ గైడెన్స్ ద్వారా ఏకకాలంలో 25 కిలో మీటర్ల పరిధిలో దూసుకొస్తున్న 4 లక్ష్యాలు ఛేదించే సామర్థ్యాన్ని ప్రదర్శించే తొలి దేశంగా భారత్‌ అవతరించింది. దేశీయంగా రూపొందించిన ఆకాశ్‌ వెపన్‌ సిస్టమ్‌ ద్వారా ఈ ప్రయోగం చేపట్టి విజయం సాధించాం' అని డీఆర్‌డీఓ పేర్కొంది.

Akash Missile System : డిసెంబర్‌ 12న ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా సూర్యలంక ఎయిర్‌ ఫోర్స్ స్టేషన్‌లో అస్త్రశక్తి - 2023 విన్యాసాలను వాయుసేన నిర్వహించింది. ఈ సందర్భంగా నింగి నుంచి దూసుకొచ్చిన నాలుగు లక్ష్యాలను ఆకాశ్​ క్షిపణి వ్యవస్థ ఏకకాలంలో ధ్వంసం చేసింది. భూతలం నుంచి గగనతలానికి దూసుకెళ్లే ఈ క్షిపణిని షార్ట్‌ రేంజ్‌ లక్ష్యాలను ఛేదించేందుకు డీఆర్​డీఓ అభివృద్ధి చేసింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఆకాశ్‌ క్షిపణులను భారత్‌ సుమారు పదేళ్లుగా సాయుధ దళాల్లో వినియోగిస్తోంది.

యూఏవీల్లో భారత్ కీలక ముందడుగు
Unmanned Aerial Vehicle India : క్షిపణి వ్యవస్థలతో పాటు మానవ రహిత విమానాలపై డీఆర్​డీఓ ముమ్మరంగా పరిశోధన చేస్తోంది. డీఆర్​డీఓ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన హైస్పీడ్‌ ఫ్లయింగ్‌ వింగ్‌ మానవరహిత విమానాన్ని (యూఏవీ) విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణ శాఖ శుక్రవారం తెలిపింది. దీంతో ఈ తరహా సంక్లిష్ట పరిజ్ఞానం కలిగిన అతికొద్ది దేశాల సరసన ఇండియా చేరినట్లు అయింది. కర్ణాటకలోని చిత్రదుర్గలో ఈ పరీక్ష జరిగింది. ఇది బాణం మొన ఆకృతిలో ఉంటుంది. దీనికి తోక భాగం ఉండదు. నేల మీద నుంచి రాడార్లు, మౌలిక వసతులు, పైలట్‌ సాయం లేకుండా ఈ యూఏవీ సొంతంగా ల్యాండింగ్‌ నిర్వహించగలిగింది. దీని సెన్సర్‌ డేటాను స్వదేశీ ఉపగ్రహ ఆధారిత దిక్సూచి వ్యవస్థ రిసీవర్లతో అనుసంధానించడం వల్ల ఇది సాధ్యమైంది. ఈ పరీక్షను విజయవంతంగా నిర్వహించిన డీఆర్‌డీవో, సైనికదళాలు, ప్రైవేటు పరిశ్రమలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ అభినందించారు.

ఆకాశ్ క్షిపణి ఎగుమతికి కేబినెట్ పచ్చజెండా

ప్రతికూల వాతావరణంలోనూ గురి తప్పని 'ఆకాశ్​'

Last Updated : Dec 18, 2023, 8:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.