ETV Bharat / bharat

'నుపుర్ తల తెచ్చిస్తే ఇల్లు రాసిస్తా'.. మత గురువు ప్రకటన.. నిందితుడు అరెస్ట్

author img

By

Published : Jul 6, 2022, 1:15 PM IST

Ajmer dargah nupur: భాజపా మాజీ ప్రతినిధి నుపుర్ శర్మ తల తెచ్చినవారికి తన ఇల్లును ఇచ్చేస్తానని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన అజ్మేర్ దర్గా మత గురువును పోలీసులు అరెస్టు చేశారు. మద్యం మత్తులో ఆ వ్యాఖ్యలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై విచారణ జరుపుతున్నట్లు స్పష్టం చేశారు.

Ajmer dargah cleric nupur sharma
Ajmer dargah cleric nupur sharma

Nupur sharma controversy: మహమ్మద్‌ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భాజపా మాజీ అధికార ప్రతినిధి నుపుర్‌శర్మ తల నరికినవాళ్లకు తన ఇంటిని బహుమతిగా ఇస్తానన్న అజమేర్‌ దర్గా మత గురువును రాజస్థాన్‌ పోలీసులు అరెస్టు చేశారు. దర్గా ఖాదిమ్ సల్మాన్ చిశ్తీ ఈ మేరకు వీడియోలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. అతడికి ఇదివరకే నేరచరిత్ర ఉందని పోలీసులు తెలిపారు.

"మంగళవారం రాత్రి అతడిని పట్టుకున్నాం. ఖాదిమ్ మొహల్లాలోని అతడి ఇంట్లోనే అదుపులోకి తీసుకున్నాం. జూన్ 28(ఉదయ్​పుర్ హత్య జరిగిన తేదీ)కు ముందే వీడియో తీసినట్టు నిందితుడు చెప్పాడు. ఆ తర్వాత వీడియో లీక్ అయిందని తెలిపాడు. మద్యం మత్తులో ఈ వ్యాఖ్యలు చేసి వీడియో తీశాడు. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నాం."
-పోలీసులు

వ్యక్తిగతమైన ఆ వ్యాఖ్యలతో దర్గాకు సంబంధం లేదని, వాటిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు అజమేర్‌ కార్యాలయ ప్రతినిధి దివాన్‌ జైనుల్‌ అబెదిన్‌ అలీ ఖాన్‌ తెలిపారు. మతసామరస్యానికి ప్రతీకగా ఉన్న దర్గా పీఠానికి ఆ వ్యాఖ్యలతో ఎటువంటి సంబంధం లేదన్నారు.
మరోవైపు, కొంతమంది వ్యక్తులు అజ్మేర్ దర్గా వద్ద జూన్ 17న రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినట్లు పోలీసులు ఇదివరకే గుర్తించారు. ఈ కేసులో గతవారం నలుగురిని అరెస్ట్ చేశారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.