ETV Bharat / bharat

మరో ఆరు వారాల్లో థర్డ్​ వేవ్​ అటాక్!​

author img

By

Published : Jun 19, 2021, 5:00 PM IST

guleria
రణ్​దీప్ గులేరియా, ఎయిమ్స్ డైరెక్టర్

ఎక్కువ మందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకూ కొవిడ్ నిబంధనలు కఠినంగా పాటించాలని దిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణ్​దీప్ గులేరియా సూచించారు. మరో 6 నుంచి 8 వారాల వ్యవధిలో మూడో దశ వైరస్ ముప్పు ఉందని హెచ్చరించారు.

కొవిడ్‌ నిబంధనలు పాటించకుండా, గుంపులు గుంపులుగా గుమిగూడితే వచ్చే 6నుంచి 8 వారాల వ్యవధిలోనే మూడోవిడత వైరస్‌ విజృంభించే ప్రమాదం ఉందని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా హెచ్చరించారు. ఎక్కువ మందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకూ కొవిడ్‌ నిబంధనలు కఠినంగా పాటించాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నిఘా పెంచటంతోపాటు ఆయాప్రాంతాల వరకు లాక్‌డౌన్‌ విధించాలని గులేరియా సూచించారు. అయితే మూడో విడతలో పిల్లలపై అధిక ప్రభావం ఉంటుందని చెప్పటానికి ఇప్పటివరకు కచ్చితమైన ఆధారాలు లేవన్నారు. గతంలో మూడో దశ వ్యాప్తి అనివార్యమని పేర్కొన్న ఎపిడమాలజిస్ట్‌లు.. సెప్టెంబర్‌-అక్టోబర్‌ మాసాల్లో విజృంభించవచ్చని పేర్కొన్నారు.

ఆంక్షల సడలింపు..
దేశంలో కరోనా కేసులు చాలావరకు తగ్గుముఖం పడుతుంటడం వల్ల పలు రాష్ట్రాలు ఆంక్షలు ఎత్తివేస్తున్నాయి. కొన్నిచోట్ల లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నా.. చాలావరకు సడలింపులు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా నిబంధనలు పాటించకుండ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. మూడోదశ ముప్పు త్వరగా ముంచుకొస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గతంలో కరోనా మూడో దశ వ్యాప్తి అనివార్యమని పేర్కొన్న అంటువ్యాధుల నిపుణులు..సెప్టెంబర్‌-అక్టోబర్‌ మాసాల్లో వైరస్‌ విజృంభిస్తుందని అంచనా వేశారు.

ఏప్రిల్‌, మే మాసాల్లో కొనసాగిన రెండోదశ కరోనా వైరస్‌.. దేశంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. పెద్దసంఖ్యలో మరణాలు నమోదు కావటంతోపాటు దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో తీవ్రమైన ఆక్సిజన్ కొరత ఏర్పడటంతో బాధితులు అల్లాడిపోయారు.

ముందుగానే..
అయితే కొన్నిరోజుల నుంచి రోజువారీ కేసులతోపాటు పాజిటివిటీ రేటు భారీగా తగ్గింది. ఒక్కరోజే 4 లక్షలకుపైగా కొత్త కేసులు నమోదైన పరిస్థితులు క్రమక్రమంగా మెరుగుపడి.. ఇప్పుడు 60వేల కేసులకు తగ్గాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించకుంటే .. మూడదోశ ముందుగానే వస్తుందని దిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా హెచ్చరించారు. ఎక్కువమందికి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తయ్యేవరకూ.. మరో భారీ వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. కొవిడ్‌ హాట్‌స్పాట్‌లపై నిఘా వ్యూహం అనుసరించటంతోపాటు.. అవసరమైతే ఆయా ప్రాంతాల వరకు లాక్‌డౌన్‌ అమలుచేయాలని గులేరియా సూచించారు. ఈ ప్రాంతంలోనైనా కరోనా కేసులు పెరిగి పాజిటివిటీ రేటు 5శాతం కంటే ఎక్కువగా ఉంటే.. ఏరియాలవారీగా లాక్‌డౌన్‌ విధించటంతోపాటు కట్టడి చర్యలు చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకొని జాతీయ స్థాయిలో లాక్‌డౌన్‌ విధించటం సమస్యకు పరిష్కారం కాదన్నారు.
మరోవైపు.. మూడదోశలో పిల్లలపై అధిక ప్రభావం ఉంటుందని చెప్పటానికి ఇప్పటివరకూ కచ్చితమైన ఆధారాలు లేవని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ గులేరియా తేల్చి చెప్పారు.

ఇదీ చదవండి:'వైరస్‌ సోకినా... వ్యాక్సిన్‌తో ప్రాణాపాయం తప్పుతుంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.