మహిళా​ కానిస్టేబుల్​ రాజీనామా.. ఇన్​స్టాలో ఆ వీడియో వల్లే!

author img

By

Published : Sep 13, 2021, 8:24 PM IST

priyanka mishra resignation

చేతిలో రివాల్వర్​ తిప్పుతూ.. వివాదాస్పద డైలాగ్ చెబుతూ ఇటీవల వైరల్​గా మారారు కాన్పుర్​కు చెందిన ఓ మహిళా కానిస్టేబుల్. ట్రోల్స్​ ఎక్కువైన నేపథ్యంలో ఆమె రాజీనామా చేయగా.. తాజాగా అధికారులు అంగీకరించారు.

ఉత్తర్​ప్రదేశ్ కాన్పుర్​కు చెందిన మహిళా కానిస్టేబుల్​ ప్రియాంక మిశ్రాపై ఇటీవల ట్రోల్స్​ ఎక్కువగా వచ్చాయి. దీనికి కారణం.. ఇన్​స్టాలో ఆమె చేసిన వీడియో! ట్రోల్స్​ను భరించలేక.. చివరికి తన ఉద్యోగానికి రాజీనామా చేశారు ప్రియాంక.

priyanka mishra resignation
ఇన్​స్టాలో డైలాగ్ చెప్తూ..

ప్రియాంక.. ఆగ్రాలోని ఎంఎం గేట్ పోలీస్ స్టేషన్​లో విధులు నిర్వర్తించేవారు. ఆ సమయంలోనే పోలీస్ యూనిఫాం ధరించి, చేతిలో రివాల్వర్​ పట్టుకుని ఆమె చెప్పిన వివాదస్పద డైలాగ్.. నెట్టింట వైరల్​గా మారింది. ఈ వీడియోతో ఆమె ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. అదే సమయంలో కొందరు ఈ వీడియోను తెగ ట్రోల్​ చేశారు. వీడియో కింద అసభ్యకరమైన కామెంట్లూ పోస్ట్ చేశారు.

priyanka mishra resignation
రివాల్వర్​తో డైలాగ్ చెప్తున్న అధికారి
priyanka mishra resignation
మహిళా కానిస్టేబుల్ ప్రియాంక మిశ్రా

నెటిజన్ల కామెంట్స్​తో విసుగుచెందిన ప్రియాంక.. తనను ట్రోల్​ చేయొద్దంటూ మరో వీడియో విడుదల చేశారు. పెద్ద తప్పు చేసినట్టుగా తనను చూస్తున్నారని.. అవసరమైతే రాజీనామ ా కూడా చేస్తాను కానీ ట్రోల్​ చేయొద్దన్నారు. ఈ క్రమంలోనే తన రాజీనామాను ఉన్నతాధికారులకు అందించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన అనంతరం తాజాగా ప్రియాంక రాజీనామాను అంగీకరించారు అధికారులు.

ఇదీ చదవండి: నలుగురు కలిసి మహిళను వివస్త్రను చేసి, ఫోన్​లో వీడియో తీసి...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.