ETV Bharat / bharat

పంజాబ్​లో కేబినెట్​ అత్యవసర భేటీ- ఏం జరుగుతోంది?

author img

By

Published : Sep 29, 2021, 10:20 AM IST

పంజాబ్​ కాంగ్రెస్​ కమిటీ పదవికి నవజ్యోత్​ సింగ్​ సిద్ధూ రాజీనామాతో సంక్షోభ పరిస్థితులు(punjab congress crisis) మరింత క్లిష్టంగా మారాయి. ఈ క్రమంలోనే అత్యవసరంగా కేబినెట్​ భేటీకి(punjab cabinet meeting today) పిలుపునిచ్చారు సీఎం చరణ్​జీత్​ సింగ్​ చన్నీ. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది? కాంగ్రెస్​ తదుపరి నిర్ణయం ఏ విధంగా ఉండనుంది?

punjab cabinet meeting
పంజాబ్​లో కేబినెట్​ అత్యవసర భేటీ

నవజ్యోత్​ సింగ్​ సిద్ధూ.. అనూహ్యంగా పీసీసీ పదవికి(punjab congress committee) రాజీనామా చేయటం వల్ల పంజాబ్​ కాంగ్రెస్​లో సంక్షోభం తీవ్రరూపం(punjab congress crisis) దాల్చింది. రెండు నెలల క్రితమే పదవి చేపట్టిన సిద్ధూ రాజీనామా చేయటం ఇటు రాష్ట్ర పార్టీ వర్గాలతో పాటు, అధిష్ఠానికి షాకింగ్​గా మారింది. ఈ క్రమంలోనే బుధవారం అత్యవసరంగా కేబినెట్​ సమావేశానికి(punjab cabinet meeting today) పిలుపునిచ్చారు నూతన ముఖ్యమంత్రి చరణ్​జీత్​ సింగ్​ చన్నీ. అత్యవసర మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయటంతో అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోందనే చర్చ మొదలైంది.

సిద్ధూ రాజీనామా చేసిన నేపథ్యంలో మంగళవారం అర్ధరాత్రి వరకు ముఖ్యమంత్రి చన్నీ నివాసంలో పలువురు మంత్రులు సమావేశమయ్యారు. పలు విషయాలపై చర్చించినట్లు సమాచారం. అయితే.. ఎలాంటి సానుకూలాంశాలు కనబడకపోవటం, మంత్రుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవటం వల్లే.. అత్యవసర కేబినెట్​ భేటీ(punjab cabinet meeting today)ని ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

" చండీగఢ్​లోని మా నివాసంలో ముఖ్యమంత్రి చరణ్​జీత్​ సింగ్​ చన్నీతో అర్ధరాత్రి వరకు చర్చలు కొనసాగాయి. "

- మన్​ప్రీత్​ సింగ్​ బాదల్​, ఆర్థిక శాఖ మంత్రి.

పంజాబ్​కు హరీశ్​ రావత్​..!

రాష్ట్ర పార్టీలో తలెత్తిన సంక్షోభాన్ని పరిష్కరించేందుకు కాంగ్రెస్​ రాష్ట్ర ఇంఛార్జ్​ హరీశ్​ రావత్​ బుధవారం దిల్లీ నుంచి పంజాబ్​కు రానున్నారు. సిద్ధూతో భేటీ అయి.. తన రాజీనామాను వెనక్కి తీసుకునేలా బుజ్జగించే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఇదీ చూడండి: కాంగ్రెస్​కు మరో షాక్- పీసీసీ చీఫ్​ పదవికి సిద్ధూ రాజీనామా

పంజాబ్​లో కాంగ్రెస్ దారెటు? ఇక కష్టమేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.