ETV Bharat / bharat

లీవ్​ ఇవ్వలేదని జవాన్​ సూసైడ్​.. 18 గంటలు కుటుంబాన్ని బందీగా చేసుకొని!

author img

By

Published : Jul 11, 2022, 5:52 PM IST

CRPF jawan Naresh Jat, who has been sittin
CRPF jawan Naresh Jat, who has been sittin

Jawan Suicide: సెలవు ఇవ్వలేదని మనస్తాపం చెందిన ఓ జవాన్​.. గన్​తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన రాజస్థాన్​లోని జోధ్​పుర్​లో జరిగింది.

Jawan Suicide: రాజస్థాన్​లోని జోధ్​పుర్​లో విషాదం జరిగింది. ఉన్నతాధికారులు సెలవు మంజూరు చేయలేదని మనస్తాపం చెందిన ఓ జవాన్..​ గన్​తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న అధికారులు.. జవాన్​ పిస్టల్​ను స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ జరిగింది.. జోధ్​పుర్​లోని సీఆర్​పీఎఫ్​ శిక్షణా కేంద్రం క్యార్టర్స్​లోని నాలుగో అంతస్తులో నివాసం ఉంటున్న జవాన్​ నరేశ్​.. ఆదివారం సెలవు కావాలని ఉన్నతాధికారులను శనివారం అడిగాడు. కొన్ని కారణాల వల్ల అధికారులు సెలవు మంజూరు చేయలేదు. దీంతో నరేశ్​ మనస్తాపం చెందాడు. కోపోద్రిక్తుడైన అతడు​ తన సహద్యోగి చేయిని కొరికాడు. ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవ కూడా జరిగింది. ఆ తర్వాత అతడ్ని శాంతింపజేయడానికి పలువురు ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది.

ఆత్మహత్య చేసుకున్న జవాన్​ నరేశ్​
ఆత్మహత్య చేసుకున్న జవాన్​ నరేశ్​

అనంతరం ఇంటి లోపలికి వెళ్లిన నరేశ్​.. తాళం వేసుకొని తన కుటుంబసభ్యులతో కలిసి బందీ చేసుకున్నాడు. ఆదివారం సాయంత్రం తన బాల్కనీలో నిల్చున్న నరేశ్​.. తన దగ్గర ఉన్న సర్వీస్​ పిస్టల్​తో గాలిలో ఎనిమిది రౌండ్లు కాల్పులు జరిపాడు. ఎవరైనా దగ్గరికి వస్తే చంపేస్తానని బెదిరించాడు. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు.. నరేశ్​తో ఫోన్​లో మాట్లాడినా అతడు శాంతించలేదు. సుమారు 18 గంటలు ఇంట్లోనే బందీలా గడిపిన జవాన్​.. సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో గన్​తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న అధికారులు.. జవాన్​ ఇంటికి వెళ్లి గన్​ను స్వాధీనం చేసుకున్నారు. మృతుడికి భార్య, కూతురు ఉన్నారు.

ఇవీ చదవండి: యువ వైద్యురాలు అనుమానాస్పద మృతి.. చేతికి ఇంజెక్షన్​!

వామ్మో.. అది ఆటోనా? లేక బస్సా?.. ఏకంగా 27 మందితో ఫుల్​ స్పీడ్​గా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.