ETV Bharat / bharat

Actor Vishal Censor Board : విశాల్​ ఎఫెక్ట్.. 'సెన్సార్​ బోర్డ్​కు లంచం'పై CBI దర్యాప్తు

author img

By PTI

Published : Oct 5, 2023, 1:44 PM IST

Updated : Oct 5, 2023, 4:35 PM IST

Hero Vishal Bribe Tweet On CBFC
Actor Vishal Censor Board

Actor Vishal Censor Board : ఇటీవల విడుదలైన 'మార్క్ ఆంటోనీ' చిత్రానికి సెన్సార్​ సర్టిఫికేషన్​ కోసం ముంబయిలోని హిందీ సెన్సార్​ బోర్డు అధికారులు తనను లంచం అడిగారంటూ ప్రముఖ తమిళ నటుడు హీరో విశాల్​ సంచలన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన సీబీఐ సంబంధిత సీబీఎఫ్​సీ అధికారులు, ముగ్గురు ప్రైవేటు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.

Actor Vishal Censor Board : ముంబయిలోని సెంట్రల్​ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్​(సీబీఎఫ్​సీ)కి చెందిన కొందరు అధికారులపై హీరో విశాల్​ చేసిన లంచం ఆరోపణల నేపథ్యంలో వారిపై గురువారం కేసు నమోదు చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ). సంబంధిత అధికారులతో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న మరికొంతమందిపై కూడా కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు సీబీఐ అధికారులు. ఇటీవలే విడుదలైన 'మార్క్ ఆంటోనీ' చిత్రానికి హిందీలో సెన్సార్ సర్టిఫికెట్ పొందేందుకు తాను రూ.6.5 లక్షలను సీబీఎఫ్​సీ అధికారులకు లంచంగా ఇవ్వాల్సి వచ్చిందని తమిళ ప్రముఖ నటుడు విశాల్ సెప్టెంబర్​ 29న సంచలన ఆరోపణలు చేస్తూ ట్విట్టర్​ వేదికగా ఓ సంచలన పోస్ట్​ పెట్టారు. ఈ నేపథ్యంలో సీబీఐ రంగంలోకి దిగింది.

సీబీఐ నమోదు చేసిన ఎఫ్​ఐఆర్​లో ఉన్న ముగ్గురు ప్రైవేటు వ్యక్తుల్లో మెర్లిన్ మేనగా, జీజా రామ్​దాస్, రాజన్​ ఎం.తో పాటు సీబీఎఫ్​సీకి చెందిన గుర్తుతెలియని ప్రభుత్వాధికారులు కూడా ఉన్నట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారి ఒకరు తెలిపారు. అంతకుముందు ఈ కేసుతో సంబంధమున్న నిందితులకు చెందిన నివాసాలు, కార్యాలయాల్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ముంబయిలోని మొత్తం నాలుగు చోట్ల ఈ దాడులు జరిపారు. అనంతరం వారిపై కేసు నమోదు చేశారు.

రూ.6.54 లక్షలకు కుదిరిన బేరం!
హీరో విశాల్​, ఎస్​జే సూర్య నటించిన 'మార్క్ ఆంటోనీ' చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్​ ఇచ్చేందుకు సెన్సార్​ బోర్డు అధికారులు కొందరు మూవీటీమ్​ను రూ.7లక్షల లంచం డిమాండ్​ చేశారని.. బేరసారాల తర్వాత చివరికి రూ.6.54లక్షలకు ఒప్పందం కుదిరిందని సీబీఐ అధికారి ఒకరు తెలిపారు.

లంచం కింద తీసుకున్న రూ.6.54 లక్షలను రెండు వేర్వేరు బ్యాంకు ఖాతాల ద్వారా అకౌంట్​లలో మూవీటీమ్​ జమ చేసిందని అధికారులు చెప్పారు. అనంతరం సెప్టెంబరు 26న హిందీలో డబ్​ చేసిన 'మార్క్ ఆంటోనీ' మూవీకి నో-అబ్జెక్షన్​ సర్టిఫికేట్​ను​ సీబీఎఫ్​సీ జారీ చేసిందని సీబీఐ తెలిపింది. అయితే నిందితుల్లో ఒకరు అంగీకరించిన లంచానికి అదనంగా మరో రూ.20 వేల రూపాయలను కో-ఆర్డినేటింగ్​ ఫీజు కింద తన బ్యాంకు ఖాతాలో వేయించుకున్నారని అధికారులు వివరించారు. కాగా, లంచంగా డిపాజిట్​ చేసిన రూ.6.54 లక్షల నుంచి రూ.6.50 లక్షలను నిందితులు వెంటనే విత్​డ్రా చేసినట్లుగా గుర్తించామని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ కొనసాగుతోంది.

'నా సినిమాకు సెన్సార్​ సర్టిఫికేట్​ పొందేందుకు సీబీఎఫ్​సీ అధికారులు మొత్తం రూ.6 లక్షలను లంచంగా అడిగారు. ముందుగా స్క్రీనింగ్​ కోసం రూ.3 లక్షలు చెల్లించమని అడిగారు. ఆ తరువాత సర్టిఫికేట్​ కోసం రూ.3.5లక్షలు అవుతాయని చెప్పారు. ఇదేంది అని అడిగితే సీబీఎఫ్​సీలో ఇది సాధారణమైన పద్ధతి అని సదరు మహిళా అధికారి నాతో అన్నారు. సెన్సార్​ క్లియరెన్స్​ పొందాలంటే సినిమా నిర్మాతలు కచ్చితంగా డబ్బులు కట్టాల్సిందే అని ఆమె నాతో అన్నారు' అని విశాల్ వివరాలతో సహా సెప్టెంబర్ 29న ట్విట్టర్​లో పోస్ట్​ పెట్టారు.

"అవినీతి అనేది సినిమాల్లో చూపిస్తే బాగుంటుంది. కానీ, నిజజీవితంలో కాదు. నా సినిమా విషయంలో జరిగిన ఈ తీరును నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ప్రభుత్వ కార్యాలయ్లాల్లో ముఖ్యంగా ముంబయిలోని సీబీఎఫ్​సీ ఆఫీసులో ఈ దారుణం జరుగుతుంది."

- విశాల్​ ట్వీట్​

ప్రధాని, సీఎంకు విశాల్​ అభ్యర్థన..
సీబీఎఫ్‌సీలో నడుస్తున్న అవినీతిని పరిశీలించాలని ప్రధాని నరేంద్రమోదీ, మహారాష్ట్ర సీఎం ఏక్​నాథ్​ శిందేను కొద్దిరోజుల క్రితం అభ్యర్ధించారు విశాల్​. ఈ నేపథ్యంలోనే కేంద్రమంత్రి అనురాగ్​ ఠాకుర్​ స్పందిస్తూ వెంటనే ఈ ఆరోపణలపై విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు.

Bhumi Pednekar Trolls : భూమి పెడ్నేకర్ వారికి గట్టి కౌంటర్​.. ఇచ్చి పడేసిందిగా!

October OTT Release Movies 2023 : ఈ వారం స్పెషల్​.. ఓటీటీల్లో విడుదలవనున్న సినిమాలు ఇవే!

Last Updated :Oct 5, 2023, 4:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.