ETV Bharat / bharat

మళ్లీ పాత రోజుల్లోకి-  ఉచితంగా ఇంటికో రేడియో

author img

By

Published : Mar 22, 2022, 9:10 AM IST

Updated : Mar 22, 2022, 10:12 AM IST

Free Radio: ప్రస్తుతం ఏ సమాచారం కావాలన్నా టీవీ, చరవాణి, అంతర్జాలం, పత్రికలు ఇలా బోలెడు మార్గాలున్నాయి. ఏదైనా చిటికెలో మనకు అందుబాటులో ఉంటుంది. కానీ పూర్వకాలంలో ఏదైనా విషయం తెలియాలంటే రేడియోలే ఆధారం. మారుమూల ప్రాంతాలకూ సమాచారాన్ని చేరవేయాలంటే ఇవే ప్రచార సాధనాలుగా ఉండేవి. మారుతున్న కాలానికి అనుగుణంగా రేడియోలు అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. కానీ అలనాటి మధుర స్మృతులను తిరిగి తీసుకొచ్చేందుకు కేరళలోని ఓ గ్రామం కృషి చేస్తోంది. ఆ సంగతులేంటో ఇప్పుడు చూద్దాం.

Kozhikode Radio Donation
పాత రోజులు మళ్లీ తేవాలని ఉచితంగా ఇంటికొక్క రేడియో

పాత రోజులు మళ్లీ తేవాలని ఉచితంగా ఇంటికొక్క రేడియో

Free Radio to Villagers: ఒకప్పుడు రేడియోలు సమాచారాన్ని చేరవేయడంతో పాటు పాత పాటలతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేవి. ఓ విధంగా చెప్పాలంటే పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంట్లో రేడియో ఎంతో అవసరమైనదిగా ఉండేది. దేశంలో ఎక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా సమాచారాన్ని ఆల్‌ ఇండియా రేడియో మారుమూల గ్రామాలకు చేరవేసేది. పంట సాగు విధానంలో ఎలాంటి మెలకువలు పాటించాలనే విషయాలతోపాటు వాతావరణ సమాచారాన్ని రైతులకు అందించేది. ఇలా ఒక్కటేమిటి అనేక రకాలుగా ప్రజలకు నిత్యం రేడియో చేరువయ్యేది. అయితే కాలానుగుణంగా వస్తున్న మార్పులకు గత స్మృతులు కనుమరుగవుతున్నాయి. ఆనాటి రోజులను మళ్లీ తీసుకురావాలని కేరళ కోజికోడ్‌ జిల్లాలో ఓ పంచాయతీ నడుం బిగించింది. కరస్సెరి పంచాయతీ పరిధిలోని అనయంకున్ను గ్రామం ఊరి ప్రజలంరందరికీ ఉచితంగా రేడియోలను అందించడానికి సంకల్పించింది.

Kozhikode Radio Donation
పాత రోజులు మళ్లీ తేవాలని ఉచితంగా ఇంటికొక్క రేడియో

Kozhikode Radio Donation

'నా రేడియో' అనే పేరుతో అనయంకున్ను గ్రామ ప్రజలకు పంచాయతీ అధికారులు రేడియోలు పంపిణీ చేస్తున్నారు.మొదట వృద్ధులు, అనారోగ్యం పాలైన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అనంతరం ఇంటికి ఒకటి చొప్పున అందించి.. యువతకు రేడియోల పట్ల ఆసక్తి కలిగించాలని భావిస్తున్నారు.

Radio Donation Kerala

Kozhikode Radio Donation
పాత రోజులు మళ్లీ తేవాలని ఉచితంగా ఇంటికొక్క రేడియో

గ్రామస్థులకు రేడియోలు అందించాలని భావించిన గ్రామ కమిటీ... మొదటి విడతలో భాగంగా 30 కుటుంబాలకు అందిస్తోంది. ఇందులో ఒక్కో రేడియోకు 14 వందల వరకు ఖర్చవుతోంది. రేడియోలకు అయ్యే ఖర్చును దాతల నుంచి సేకరించి ఉచితంగా అందిస్తున్నారు. నా రేడియో కార్యక్రమం పూర్తయితే... దేశంలోనే మొదటి పూర్తిస్థాయి రేడియోలు కలిగిన గ్రామంగా అనయంకున్ను చరిత్ర సృష్టించనుంది.

ఇదీ చదవండి: ఆడపిల్ల అని.. పసికందును హత్యచేసి 'ఒవెన్'​లో పెట్టిన తల్లి!

Last Updated : Mar 22, 2022, 10:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.