ETV Bharat / bharat

నడిరోడ్డుపై ప్రేయసిని దారుణంగా చంపిన ప్రియుడు.. అలా చేసిందన్న కోపంతో..

author img

By

Published : Dec 15, 2022, 4:49 PM IST

ప్రేయసి తనను వదిలేసిందన్న కోపంతో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. పట్టపగలే నడిరోడ్డుపై హతమార్చాడు. కేరళలో జరిగిందీ ఘటన.

murder
murder

తనను వదిలి వెళ్లిందన్న కోపంతో ఓ 50 ఏళ్ల మహిళను తన ప్రియుడు పట్టపగలే హత్య చేసిన ఘటన కేరళలో వెలుగుచూసింది. మహిళను హత్య చేసిన తర్వాత పరారైన నిందితుడు గురువారం పోలీసుల చేతికి చిక్కాడు. విచారణలో నిజాన్ని ఒప్పుకున్నాడు.

పోలీసుల కథనం ప్రకారం.. కేరళలోని కిలిమానూర్​లో నివసిస్తున్న రాజేశ్​​ అదే ప్రాంతంలో జ్యూస్​ షాపు నడుపుతూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో వాలయిల​కు చెందిన సింధు అనే మహిళతో అతడికి పరిచయం ఏర్పడింది. అలా వారిద్దరూ 12 ఏళ్లుగా లివ్​ ఇన్​ రిలేషన్​షిప్​లో ఉన్నారు. అయితే గత నెలలో వారిద్దరి మధ్య గొడవల రావడం వల్ల రాజేశ్​కు దూరమైన సింధు మరో ఇంట్లో నివసిస్తోంది. ఇక సింధు తన దగ్గరకు తిరిగి రాదని భావించిన రాజేష్​ ఆమెను హతమార్చేందుకు ప్లాన్​ చేశాడు.

అలా గురువారం ఉదయం ఓ బస్సు ఎక్కి సింధు దిగిన స్టాప్​​లోనే దిగాడు. కాసేపు తర్వాత ఆమెపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. మెడతో పాటు చేతిపై గాయలవ్వడం వల్ల అపస్మారక స్థితికి చేరుకున్న సింధును స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

పోక్సో కేసు నిందితుడిని..
ఓ కేసు విషయమై పోక్సో నిందితుడిని అరెస్టు చేసేందుకు వెళ్లిన ఓ పోలీస్​ ఆఫీసర్​ ఆ యువకుడిని సెక్స్​లో పాల్గొనమని ఒత్తిడి చేశాడు. అంతే కాకుండా అతడిని లంచం కూడా అడిగాడు. ఈ ఘటన కేరళలోని తిరువనంతపురంలో జరిగింది. భయపడ్డ బాధితుడు పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేయగా సదరు పోలీస్​ ఆఫీసర్​ను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇదివరకే లంచం ఆరోపణల విషయమై ఆయన సస్పెన్షన్​లో ఉన్నట్లు తెలిసింది.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.