ETV Bharat / bharat

49 ఏళ్ల ఏజ్​లో హోంగార్డ్ ఉద్యోగం.. అపాయింట్​మెంట్ లెటర్ కోసం 14 సంవత్సరాలు వేచి చూస్తే..

author img

By

Published : May 8, 2023, 4:05 PM IST

Updated : May 8, 2023, 4:25 PM IST

జాబ్ అపాయింట్​మెంట్ లెటర్ కోసం 14 ఏళ్లుగా వేచి చూసింది ఓ మహిళ. ఆఖరికి ఉద్యోగంపై ఆశలు వదులుకుంది. ప్రస్తుతం ఆమెకు 49 ఏళ్లు. రెండేళ్ల మనవడు కూడా ఉన్నాడు. అయితే ఇప్పుడు ఆమెకు హోంగార్డు ఉద్యోగ అపాయింట్​మెంట్ లెటర్ అందింది.

renu devi home guard
కుటుంబ సభ్యులతో రేణు దేవి

పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించింది ఓ మహిళ. 49 ఏళ్ల వయసులో హోంగార్డు ఉద్యోగం సాధించింది. ఈ కొలువు కోసం దాదాపు 14 ఏళ్లు వేచి చూసింది. తాజాగా నియామక పత్రం.. ప్రభుత్వం నుంచి అందింది. దీంతో ఆమె సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఆమే బిహార్​కు చెందిన రేణు దేవి. ఆమె విజయ గాథ ఏంటో ఓ సారి తెలుసుకుందాం.

వైశాలి జిల్లాలోని హాజీపుర్​కు చెందిన రేణు దేవికి 1990లో వివాహం అయ్యింది. ఆమెకు ముగ్గురు సంతానం. ఆమె హోంగార్డు ఉద్యోగం కోసం 2009లో దరఖాస్తు చేసుకుంది. సంబంధిత అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించింది. అయితే రేణు దేవికి అపాయింట్​మెంట్​ లెటర్​ లభించలేదు. నియామకం పత్రం అందుతుందన్న ఆశతో ఆమె దాదాపు 14 ఏళ్లు వేచి చూసింది. చివరకు ఉద్యోగం మీద ఆశలు వదులుకుంది. ఈ 14 ఏళ్లలో రేణు దేవి తన ముగ్గురు కుమారులకు వివాహం కూడా చేసేసింది. ఆమెకు ప్రస్తుతం రెండేళ్ల మనవడు ఉన్నాడు. ప్రస్తుతం రేణు దేవి వయసు 49 ఏళ్లు.

renu devi home guard
కుటుంబ సభ్యులతో రేణు దేవి

2009లో హోంగార్డు జాబ్​ కోసం దరఖాస్తు చేశా. అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించా. అపాయింట్​మెంట్ లెటర్ వస్తుందని 14 ఏళ్లు ఎదురుచూశా. ఆఖరికి ఉద్యోగం రాదని ఆశ వదులుకున్నా. ఇప్పుడు అపాయింట్​మెంట్ లెటర్ రావడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఇప్పుడు రెండేళ్ల వయసున్న మనవడు ఉన్నాడు. మా కుటుంబ సభ్యులందరూ చాలా సంతోషంగా ఉన్నారు.

--రేణు దేవి, హోంగార్డు ఉద్యోగం సాధించిన మహిళ

మరోవైపు.. ఉద్యోగ నియామక పత్రం ఇంత ఆలస్యంగా ఇవ్వడంపై ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. 240 మందికి హోంగార్డు ఉద్యోగ అపాయింట్‌మెంట్ లెటర్లు ఇచ్చామని.. అందులో 9 మందిని కారుణ్య నియామక ప్రాతిపదికన విధుల్లోకి తీసుకున్నామని హోజీపుర్​ డీఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు.

'అగ్నివీర్'​గా ఆటో డ్రైవర్ కుమార్తె..
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నివీర్​ పథకం కింద ఆటో డ్రైవర్​ కుమార్తె.. సైన్యంలో చోటు సంపాదించింది. ఛత్తీస్‌గఢ్​ నుంచి అగ్నివీర్​ ద్వారా సైన్యంలో చేరే మొదటి యువతిగా ఆమె నిలిచింది. దుర్గ్ జిల్లాలో నివాసం ఉండే హిషా బఘేల్ అనే యువతి.. ఈ ఏడాది జనవరిలో సైన్యానికి ఎంపికై తన కోరికను నేరవేర్చుకుంది. హిషా సైన్యంలో చోటు సంపాదించడం పట్ల ఆమె కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

గతేడాది సెప్టెంబర్​లో అగ్నివీర్ పథకం కింద నేవీ రిక్రూట్‌మెంట్ కోసం హిషా దరఖాస్తు చేసింది. ఆమెకు ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించిన అధికారులు.. హిషాను సైన్యంలోకి తీసుకున్నారు. మార్చి వరకు ఒడిశాలోని శిక్షణ తీసుకోనుంది హిషా. శిక్షణ అనంతరం ఆమె సైన్యంలో చేరనుంది. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

Last Updated :May 8, 2023, 4:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.