ETV Bharat / bharat

కోచింగ్​ సెంటర్​లో చిగురించిన ప్రేమ.. గుడిలో పెళ్లి చేసుకున్న టీచర్​, స్టూడెంట్​

author img

By

Published : Dec 10, 2022, 5:42 PM IST

ఓ కోచింగ్​ సెంటర్​లో వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ ప్రేమను పెళ్లి పీటల వరకు తెచ్చింది ఆ జంట. కానీ ఇది ఇద్దరు విద్యార్థుల ప్రేమ కథ కాదు. ఓ స్టూడెంట్​ టీచర్ లవ్​స్టోరీ.

42-year-teacher-married-22-year-student
42-year-teacher-married-22-year-student

కోచింగ్​ సెంటర్​లో చిగురించిన ప్రేమ.. గుడిలో పెళ్లి చేసుకున్న టీచర్​, స్టూడెంట్​

బిహార్​కు చెందిన ఓ కోచింగ్​ సెంటర్​ ఉపాధ్యాయుడు.. తన క్లాస్​కు వచ్చిన విద్యార్థినిని వివాహం చేసుకున్నాడు. వీరిద్దరి పెళ్లికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రోస్​డా బజార్​లో ఇంగ్లీష్​ కోచింగ్ సెంటర్​ను సంగీత్​ కుమార్(42)​ అనే ఓ ఉపాధ్యాయుడు నడుపుతున్నాడు. ఇంగ్లీష్​​ క్లాసులను చక్కగా చెబుతున్నాడు. అయితే ఆ కోచింగ్​ సెంటర్​కు శ్వేతా కుమారి(20) అనే యువతి ఇంగ్లీష్​ నేర్చుకోవడానికి కొన్నిరోజుల క్రితం వచ్చింది. అదే సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అలా వారి ప్రేమ.. పెళ్లి వరకు దారి తీసింది.

42-year-teacher-married-22-year-student
ఏడడుగులు వేస్తున్న జంట

తాజాగా వీరిద్దరూ అగ్నిసాక్షిగా ఏడడుగులు వేశారు. స్నేహితులు, బంధువుల మధ్య థానేశ్వర్ ఆలయంలో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత మ్యారేజ్​ను రిజిస్టర్​ ఆఫీస్​లో నమోదు కూడా చేసుకున్నారు. అయితే ఆ ఉపాధ్యాయుడి భార్య కొన్నేళ్ల క్రితం మరణించిందని సమాచారం. విద్యార్థినితో ఆయనది రెండో పెళ్లి అని తెలిసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.