ETV Bharat / bharat

World Rhino Day: భారీ సంఖ్యలో ఖడ్గమృగాల కొమ్ముల దహనం

author img

By

Published : Sep 22, 2021, 12:50 PM IST

Updated : Sep 22, 2021, 2:41 PM IST

అసోం ప్రభుత్వ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో ఖడ్గమృగాల కొమ్ముల దహనం జరిగింది. ఖడ్గమృగాల కొమ్ముల్లో ఔషధ గుణాలున్నాయన్న అపోహలను ప్రజల్లో తొలగించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రపంచ ఖడ్గమృగ దినోత్సవం (world rhino day 2021) సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

rhino horns set to burnt in Assam
ఖడ్గమృగాల కొమ్ముల దహనం

ప్రపంచ ఖడ్గమృగాల సంరక్షణ దినం(world rhino day 2021) సందర్భంగా.. అసోం రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఖడ్గమృగాల కొమ్ముల దహనం(rhino horn burning) జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ(Assam cm) ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 1979 నుంచి ఇప్పటివరకు వివిధ సంఘటనల్లో స్వాధీనం చేసుకున్న 2,479 కొమ్ములను గోలాఘాట్‌ జిల్లాలోని కాజీరంగ నేషనల్​ పార్క్​ సమీపంలో బొకాఖట్‌ కవాతు మైదానంలో బహిరంగంగా దహనం చేశారు. ఖడ్గమృగాల కొమ్ముల్లో ఔషధ గుణాలున్నాయన్న అపోహలను తొలగించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని రాష్ట్ర సర్కారు పేర్కొంది.

rhino horns set to burnt in Assam
ఖడ్గమృగాల కొమ్ములను దహనం చేస్తున్న సిబ్బంది
rhino horns set to burnt in Assam
భారీ సంఖ్యలో కాలుస్తున్న ఖడ్గమృగాల కొమ్ములు

ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు(Rhino horn really work) ప్రపంచంలో అత్యధికంగా అసోంలోనే ఉన్నాయి. చైనా దేశస్థులు సంప్రదాయ వైద్యం మందుల తయారీలో దీనిని వినియోగిస్తారు. వియత్నాంలో ఈ కొమ్మును కలిగి ఉండటం ఒక హోదాగా భావిస్తారు. ఈ దేశాల్లో ఉన్న గిరాకీ వల్ల ఖడ్గమృగాల వేట సాధారణమైపోయింది.

rhino horns set to burnt in Assam
కాలుతున్న ఖడ్గమృగాల కొమ్ములు
Rhino horns
ఖడ్గమృగాల కొమ్ములు

ఇదీ చూడండి: దేశంలో మరోసారి పెరిగిన కరోనా కేసులు

Last Updated :Sep 22, 2021, 2:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.