ETV Bharat / bharat

'మహా'లో తగ్గిన కేసులు- గుజరాత్​, దిల్లీలో ఉద్ధృతం

author img

By

Published : Mar 22, 2021, 10:43 PM IST

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. వివిధ రాష్ట్రాల్లో రోజువారి కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో కొత్తగా 24 వేల మందికిపైగా వైరస్​ సోకింది. వైరస్​ ఉద్దృతి దృష్ట్యా ఆ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో లాక్​డౌన్ విధించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు గుజరాత్​, దిల్లీలో కేసుల పెరుగుదల ఆందోళనకరంగా కొనసాగుతోంది.

24,645 new coronaviurs cases in Maharashtra, 58 deaths
'మహా'లో తగ్గిన కరోనా కేసులు- గుజరాత్​, దిల్లీలో ఉద్ధృతం

మహారాష్ట్రలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఆదివారం 30వేలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా.. సోమవారం కొత్తగా 24 వేల 645 మందికి పాజిటివ్​గా నిర్ధరణ అయింది. కొత్తగా.. మరో 58 మంది వైరస్​ ధాటికి ప్రాణాలు కోల్పోయారు.

  • మొత్తం కేసులు: 25,04,327
  • మొత్తం రికవరీలు: 22,34,330
  • మొత్తం మరణాలు: 53,457

ముంబయిలో కేసులు..

మహారాష్ట్రలోని ముంబయి నగరంలో కొవిడ్​ ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 3,262 మందికి వైరస్​ సోకింది.

  • మొత్తం కేసులు: 3,65,937
  • మొత్తం మరణాలు: 11,596

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాల్లో లాక్​డౌన్​ విధించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఆరోగ్య మంత్రి రాజేశ్​ తోపే తెలిపారు. నిబంధనలు పాటించకపోతే.. ప్రభుత్వం లాక్​డౌన్ విధించొచ్చని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై.. ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రేతో ఆయన మంగళవారం సమావేశమవ్వనున్నారు.

దిల్లీలో కేసులు..

దిల్లీలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరో 888 మందికి వైరస్​ సోకింది. గత మూడు నెలల్లో నమోదైన కేసుల్లో ఇవే అత్యధికం. కాగా.. మరో ఏడుగురు మృతి చెందారు.

  • మొత్తం కేసులు: 6,48,872
  • మొత్తం రికవరీలు: 6,33,975
  • మొత్తం మరణాలు: 10,963
  • యాక్టివ్​ కేసులు: 3,934

గుజరాత్​లో కేసులు..

గుజరాత్​లో కొత్తగా 1,640 మందికి కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

  • మొత్తం కేసులు: 2,88,649
  • మొత్తం రికవరీలు: 2,76,348
  • మొత్తం మరణాలు: 4,454
  • యాక్టివ్​ కేసులు: 7,847

జోరుగా వ్యాక్సినేషన్​..

మరోవైపు దేశంలో కరోనా టీకా పంపిణీ కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది. సోమవారం 19,65,635 టీకా డోసులు అందజేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు 4,72,07,134 టీకా డోసులు పంపిణీ చేసినట్లు చెప్పింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.