ETV Bharat / bharat

ముంబయి పేలుళ్ల దోషి నూర్ మొహమ్మద్ మృతి

author img

By

Published : Mar 9, 2021, 5:44 AM IST

ముంబయి పేలుళ్ల దోషి నూర్ మొహమ్మద్ ఖాన్ మరణించాడు. దీర్ఘకాల వ్యాధులతో అతడు ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు తెలిపారు. అతని మృతదేహానికి సోమవారం అంత్యక్రియలు పూర్తైనట్లు చెప్పారు.

1993 Mumbai blasts convict Noor Mohammad Khan dies
ముంబయి పేలుళ్ల దోషి నూర్ మొహమ్మద్ మృతి

1993 ముంబయి పేలుళ్ల ఘటనలో దోషిగా తేలిన నూర్ మొహమ్మద్ ఖాన్ మృతి చెందాడు. దీర్ఘకాల వ్యాధులతో అతను తన నివాసంలోనే చనిపోయాడని పోలీసులు తెలిపారు. నూర్ మొహమ్మద్ ఆదివారం మరణించగా.. సోమవారం అంత్యక్రియలు పూర్తైనట్లు అధికారులు తెలిపారు.

ముంబయి వరుస పేలుళ్ల కేసులో 2006 నవంబర్ 24న ప్రత్యేక కోర్టు అతడికి పదేళ్ల జైలు శిక్ష విధించింది. వృత్తిరీత్య బిల్డర్ అయిన నూర్.. ముంబయి దాడులకు సహకరించాడు. 58 బ్యాగుల ఆర్​డీఎక్స్​ను తన గోదాంలో నిల్వ ఉంచాడు. పేలుళ్లకు పథకరచన చేసిన టైగర్ మెమన్​కు సన్నిహితుడిగా నూర్​కు పేరుంది.

ఇదీ చదవండి: ముంబయి పేలుళ్ల దోషి యూసుఫ్ మెమన్ మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.