ETV Bharat / bharat

వారు వేధిస్తున్నారని 14 మంది వైద్యులు రాజీనామా!

author img

By

Published : May 13, 2021, 4:12 PM IST

ఉత్తర్​ప్రదేశ్ ఉన్నావ్​ జిల్లాలో ఉన్నతాధికారులు.. తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ప్రాథమిక వైద్య కేంద్రాల్లో పనిచేసే 14 మంది వైద్యులు రాజీనామా చేశారు. అయితే జిల్లా కలెక్టర్​తో చర్చలు ముగిసేంత వరకు కరోనా సేవలు కొనసాగిస్తామని వైద్యులు తెలిపారు.

14 doctors in UP resign
14 మంది వైద్యులు రాజీనామా

ఉత్తర్​ప్రదేశ్ ఉన్నావ్​ జిల్లాలో ఉన్నతాధికారులు.. తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, మానసికంగా వేధిస్తున్నారని 14 మంది వైద్యులు రాజీనామా చేశారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం తమ రాజీనామా పత్రాలను జిల్లా ప్రధాన వైద్యాధికారి కార్యాలయంలో సమర్పించారు. తమ రాజీనామా కాపీని వైద్యశాఖ అదనపు ముఖ్య కార్యదర్శి కార్యాలయానికి పంపించారు.

సేవలు కొనసాగిస్తాం..

అయితే జిల్లా కలెక్టర్, ప్రధాన వైద్యాధికారితో చర్చలు ముగిసేంతవరకు కరోనా వైద్య సేవలు కొనసాగిస్తామని వైద్యులు తెలిపారు. వీరంతా.. జిల్లాలోని వివిధ ప్రాథమిక వైద్య కేంద్రాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు.

" ఏడాది నుంచి గ్రామీణ ప్రాంతాల్లో వనరులు అరకొరగా ఉన్నా.. వైద్య సేవలు కొనసాగిస్తున్నాం. మాకు సహకరించాల్సిన ఉన్నావ్ జిల్లా కలెక్టర్, జిల్లా ప్రధాన వైద్యాధికారి.. మాతో అమర్యాదగా, అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. "

-- ఓ వైద్యుడి ఆవేదన

జిల్లా కలెక్టర్, జిల్లా ప్రధాన వైద్యాధికారితో చర్చించాక తదుపరి కార్యాచరణ ప్రణాళికను నిర్ణయిస్తామన్నారు.

అయితే.. వైద్యులు రాజీనామా చేయలేదని.. వాళ్లు విధులకు హాజరవుతున్నారని జిల్లా ప్రధాన వైద్యాధికారి తెలిపారు. తాము వారితో అమర్యాదగా ప్రవర్తించలేదని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి : 'కరోనాకు జీవించే స్వేచ్ఛ ఉంది కదా?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.