ETV Bharat / bharat

మరోసారి వెయ్యి దాటిన కరోనా కేసులు.. పెరిగిన మరణాలు

author img

By

Published : Apr 13, 2022, 9:48 AM IST

covid cases in india
కరోనా

Covid Cases in India: దేశంలో కొత్తగా 1,088 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 26 మంది ప్రాణాలు కోల్పోగా, 1081 మంది కోలుకున్నారు. మరోవైపు మంగళవారం దేశవ్యాప్తంగా 15,05,332 టీకాలను కేంద్రం పంపిణీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా కూడా భారీగా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 10,33,034 మందికి వైరస్​ సోకింది.

Covid Cases in India: దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న క్రమంలో తాజాగా మరోసారి కేసుల్లో పెరుగదల నమోదైంది . కొత్తగా 1,088 కరోనా కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,30,38,016కు చేరింది. మరో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,081 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. మంగళవారంతో పోలిస్తే మరణాలు స్వల్పంగా పెరిగాయి. యాక్టివ్ కేసులు 10,870 ఉన్నాయి.

యాక్టివ్ కేసులు: 10,870
• మరణాలు: 5,21,736
• మొత్తం కేసులు: 4,30,38,016
• రికవరీలు: 4,25,05,410

Vaccination in India: దేశంలో కరోనా టీకా పంపిణీ వేగంగా సాగుతోంది. 15,05,332 మందికి మంగళవారం టీకాలు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,86,07,06,499కు చేరింది. కొత్తగా 4,29,323 కరోనా టెస్టులు నిర్వహించారు. ఇప్పటివరకు మొత్తం 79,49,54,525‬ కరోనా పరీక్షలు చేశారు. మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా 10,33,034 కొత్త కేసులు నమోదయ్యాయి. మహమ్మారి ధాటికి 3,147 మంది ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ కొరియా, జర్మనీ, ఆస్ట్రేలియా, ఇటలీ, ఫ్రాన్స్​ దేశాల్లో కొవిడ్​ ఉద్ధృతి తీవ్రంగా ఉంది.

  • దక్షిణ కొరియాలో తాజాగా 2,10,676 కరోనా కేసులు నమోదయ్యాయి. 171 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • జర్మనీలో 1,64,628 కొవిడ్​ కేసులు వెలుగుచూశాయి. 2,74,700 మంది కోలుకోగా 288 మంది మృతిచెందారు.
  • ఫ్రాన్స్​​లో తాజాగా 1,90,762 మంది వైరస్​ సోకింది. మరో 159 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఆస్ట్రేలియాలో 45,563 కరోనా కేసులు బయటపడ్డాయి. 40 మంది వైరస్​కు బలయ్యారు.
  • ఇటలీలో 83,643 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 169 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి : 'ఎక్స్​ఈ' వేరియంట్​ను తేలిగ్గా తీసుకోవద్దు.. మాస్కుతోనే వైరస్​ కట్టడి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.