ETV Bharat / bharat

'పీఎం కేర్స్'​పై మోదీకి మాజీ అధికారుల లేఖ

author img

By

Published : Jan 16, 2021, 8:29 PM IST

100 former civil servants raise questions over transparency in PM-CARES Fund
'మేం అన్నీ గమనిస్తున్నాం.. పీఎం కేర్స్​ లెక్కలు తేలాలి'

కరోనా కష్టకాలంలో కేంద్రం ఏర్పాటు చేసిన పీఎం-కేర్స్​పై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ మాజీ ఐఏఎస్, ఐపీఎస్​ అధికారులు ప్రధానమంత్రికి లేఖ రాశారు. నిధుల వినియోగం, లబ్ధిదారుల వివరాలను బహిర్గతం చేయాల్సిన అవసరం ఉందని లేఖలో పేర్కొన్నారు.

కరోనా సహా అత్యవసర పరిస్ధితులు తలెత్తినప్పుడు సహాయం చేసేందుకు ఏర్పాటు చేసిన పీఎం-కేర్స్‌ పారదర్శకతపై ప్రశ్నలు లేవనెత్తుతూ.. దేశంలోని 100మంది మాజీ ఐఏఎస్, ఐపీఎస్​ అధికారులు ప్రధాని నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాశారు. పీఎం-కేర్స్‌ లబ్దిదారులు, ఖర్చులకు సంబంధించిన ఆర్థిక వివరాలను.. ప్రజా జవాబుదారీ ప్రమాణాలను అనుసరిస్తూ బయటపెట్టాల్సిన అవసరం ఉందని వారు ఈ లేఖలో పేర్కొన్నారు.

పీఎం-కేర్స్‌పై జరుగుతున్న చర్చను నిశితంగా గమనిస్తున్నామని తెలిపిన మాజీ ఐఏఎస్​ అధికారులు... దాని నిర్వహణలో జవాబు లేని అనేక ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయని అన్నారు. ప్రధానమంత్రి హోదాకు భంగం వాటిల్లరాదంటే.. ఆయనతో ముడిపడిన అన్ని అంశాల్లోనూ పూర్తి పారదర్శకత ఉండాల్సిన అవనసరం ఉందని అభిప్రాయపడ్డారు.

ఈ లేఖపై సంతకం చేసిన వారిలో.. మాజీ ఐఎఎస్ అధికారులు అనితా అగ్నిహోత్రి, ఎస్పీ అంబ్రోస్, శరద్ బెహర్, సజ్జాద్ హసన్, హర్ష్ మాండర్ సహా పలువురు ఐపీఎస్​ మాజీ అధికారులు కూడా ఉన్నారు.

కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 2020 మార్చిలో పీఎం-కేర్స్‌ను ఏర్పాటు చేసింది.

ఇవీ చూడండి:

పీఎం కేర్స్‌ ప్రభుత్వ అధీనంలోనిదే! కానీ..

'పీఎం కేర్స్ ఫండ్​ పారదర్శకతకో నమస్తే'

పీఎం కేర్స్​ విదేశీ విరాళాలపై కాంగ్రెస్ ప్రశ్నల వర్షం

కేంద్రంపై దీదీ నిప్పులు- పీఎం కేర్స్​ నిధులపై ప్రశ్న

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.