చిన్నారులతో టాయిలెట్లు శుభ్రం చేయించిన టీచర్లు
Published on: Sep 16, 2022, 8:33 PM IST |
Updated on: Sep 16, 2022, 9:04 PM IST
Updated on: Sep 16, 2022, 9:04 PM IST

ముక్కుపచ్చలారని చిన్నారులతో టాయిలెట్లు శుభ్రం చేయిస్తున్న ఘటన పంజాబ్‌లో హొషియార్పూర్‌లో వెలుగు చూసింది. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న చిన్నారులతో ఉపాధ్యాయులే టాయిలెట్లను శుభ్రం చేయించడం స్థానికంగా కలకలం రేపింది. రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చిన వ్యక్తిగత పరిశుభ్రతపై పిల్లల్లో అవగాహన పెంచేందుకే ఇలా చేశామని ఆ పాఠశాల ఉపాధ్యాయురాలు తెలిపింది. చిన్నారులతో పాటే తామూ టాయిలెట్లు శుభ్రం చేశామని వారు పేర్కొన్నారు. అయితే వైరల్ అవుతోన్న వీడియోలో ఒక్క ఉపాధ్యాయుడు కూడా కనిపించలేదని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు తెలిపారు.
Loading...