నది దాటి ఊర్లోకి వచ్చిన ఏనుగు పిల్ల.. గ్రామస్థుల ఆటలు!.. అధికారులు వచ్చి..

By

Published : Sep 14, 2022, 11:20 AM IST

Updated : Sep 14, 2022, 11:36 AM IST

thumbnail

నది దాటుతూ తప్పిపోయి గ్రామానికి వచ్చిన ఓ ఏనుగు పిల్లను తిరిగి అడవిలోకి విడిచిపెట్టారు అటవీ శాఖ అధికారులు. ఈ సంఘటన ఛత్తీస్​గఢ్​లోని జష్​పుర్​ జిల్లాలో జిరిగింది. తప్కారా అటవీ ప్రాంత సమీపంలో ప్రవహిస్తున్న ఈబ్​ నది దాటుతూ ఓ ఏనుగు పిల్ల తన గుంపు నుంచి తప్పిపోయి సందామ గ్రామానికి చేరుకుంది. గ్రామస్థులంతా ఆ ఏనుగు పిల్లతో సరదాగా ఆడుతూ పాడుతూ గడిపారు. వీడియోలు తీసి సోషల్​ మీడియాలో పోస్ట్​ చేశారు. అయితే సమచారం అందుకున్న అటవీశాఖ అధికారులు గ్రామానికి చేరుకుని పిల్ల ఏనుగును పరిశీలించి వైద్యపరీక్షలు చేయించారు. అనంతరం ఆ ఏనుగు పిల్లను అడవిలోకి విడిచిపెట్టారు.

Last Updated : Sep 14, 2022, 11:36 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.