కోల్‌కతా వెళ్లేందుకు సికింద్రాబాద్‌లో రైలు ఎక్కి - పలాస స్టేషన్లో ట్రాక్ పడుకుని ఆత్మహత్య చేసుకున్న యువతి యువకుడు
Young Women and Man Commit Suicide in Palasa Railway Station : శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గూడ్స్ రైలు కిందపడి యువతి, యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరు పశ్చిమ బెంగాల్‌కు (west bengal) చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
Dead Person Belongs to Darjeeling : మృతి చెందిన వారు పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ (Darjeeling) ప్రాంతానికి చెందిన రంజనా రాయ్, తాషి షేర్పాగా పోలీసులు గుర్తించారు. వీరు శనివారం సికింద్రాబాద్ నుంచి కోల్‌కతా వెళ్తున్న షాలీమార్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్నారు. రైలు పలాస చేరుకోగానే ఇద్దరూ రైల్వే స్టేషన్లో దిగారు. కాసేపటి తరువాత ట్రాక్‌పై పడుకొని బలవన్మరణానికి పాల్పడ్డారని రైల్వే పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పలాసలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాల పై పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.