Woman Protest infront of Boyfriend's House: 'తోటి వాలంటీర్​ ప్రేమించి మోసం చేశాడు.. న్యాయం చేయండి'

By

Published : Aug 16, 2023, 9:10 PM IST

thumbnail

Woman Staged Protest in Front of Boyfriend House: వైఎస్ఆర్ కడప జిల్లా కాశినాయన మండలం ఆకుల నారాయణ పల్లెలో వాలంటీర్ల ప్రేమ వ్యవహారం వివాదాస్పమైంది. ఎస్సీ కాలనీకి చెందిన కావేరి.. చెన్నారెడ్డి వాలంటీర్లుగా పని చేస్తున్నారు. ఇరువురి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వీరి ప్రేమ కొంత కాలంగా గుట్టుచప్పుడు కాకుండా సాగింది. ఎట్టకేలకూ ఇరువురి ఇళ్లలో తెలిసింది. ఇరువురి కులాలు వేరు కావడంతో పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. ఈ విషయమై రెండు కుటుంబాల పెద్దలు పంచాయితీ కూడా నిర్వహించారు. ఏ విషయం కొలిక్కి రాకపోవడంతో ఇటీవల ప్రేమికులు బెంగళూరుకు చేరుకున్నారు. అనంతరం కావేరిని ఊరిలో వదిలివెళ్లిన చెన్నారెడ్డి మళ్లీ కనిపించలేదు. దీంతో మోసపోయానని భావించిన బాధితురాలు.. అతని కోసం గాలించింది. ఎంత వెతికినా ప్రయోజనం లేకపోవడంతో...  తిరిగి తన గ్రామానికి చెరుకున్న కావేరి, తన తండ్రితో కలిసి చెన్నారెడ్డి నివాసానికి చేరుకుని.. అతని ఇంటిముందు ఆందోళనకు దిగింది. తనకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తోంది. ప్రేమ పేరుతో చెన్నారెడ్డి మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేస్తోంది. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.