TTD New Governing Council: తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం

By ETV Bharat Telugu Team

Published : Aug 25, 2023, 11:06 PM IST

thumbnail

TTD New Governing Council: కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ శ్రీనివాసుడి సేవ కోసం ప్రభుత్వం నూతన పాలక మండలిని ప్రకటించింది. 24 మంది సభ్యులతో కూడిన ఈ జాబితాను శుక్రవారం వెల్లడించింది.  ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, పొన్నాడ సతీష్‌తోపాటు, తిప్పేస్వామి, అశ్వత్ధ నాయక్, నాగసత్యం యాదవ్, సీతారామిరెడ్డి, సుబ్బరాజు, యానాదయ్య, మాసీమబాబు, శిద్ధా సుధీర్, నాగసత్యం యాదవ్, వై.సీతారామిరెడ్డి, శరత్ చంద్రారెడ్డి, మేకా శేషుబాబు, ఆర్.వెంకటసుబ్బారెడ్డి, రాంరెడ్డి, జి.సీతారెడ్డికి సభ్యులుగా అవకాశమిచ్చింది. మహారాష్ట్ర నుంచి తితిదే సభ్యులుగా అమోల్ కాలే, సౌరబ్ బోరా, మిలింద్ నర్వేకర్, గుజరాత్‌కు చెందిన కేతన్ దేశాయ్‌, తమిళనాడుకు చెందిన బాల సుబ్రహ్మణియన్‌ పళనిసామి, డాక్టర్‌ శంకర్, కృష్ణమూర్తి వైద్యనాథన్ కర్ణాటక నుంచి దేశ్ పాండేకు అవకాశం కల్పించింది. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని నియమించిన విషయం తెలిసిందే.. తాజాగా కొత్త పాలక మండలి నియామకంలో.. రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలతో పాటుగా వివిధ వర్గాలకు చెందిన వ్యక్తులకు అవకాశం కల్పించినట్లయింది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.