Tirumala Srivari Navaratri Brahmotsavam 2023: ఘనంగా తిరుమల బ్రహ్మోత్సవాలు.. చినశేష వాహనంపై దర్శనమిచ్చిన స్వామివారు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 16, 2023, 11:42 AM IST

thumbnail

Tirumala Srivari Navaratri Brahmotsavam 2023 : నవరాత్రిని పురస్కరించుకొని తిరుమలలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఉదయం చిన్నశేష వాహనసేవ కార్యక్రమం నిర్వహించారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ  వాహనసేవలో  వేలాదిమంది భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. నవరాత్రి వేడుకల్లో భాగంగా  రాత్రి 7గంటలకు హంసవాహన సేవ చేయనున్నారు.

Tirumala Srivari Brahmotsavam chinnashesha vahana Seva : సాధారంణంగానే తిరుమల ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ప్రత్యేకించి నవరాత్రులు కావడంతో వేలాది మంది భక్తులు స్వామి వారి దర్శనానికి తరలి వస్తున్నారు. తిరుమల వీధులలో వాహనసేవలు, స్వామివారి ఊరేగింపు వేడుకల్లో పాల్గొంటున్నారు. దసరా సెలవులు కావడంతో తిరుమలకు భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఎంతో వైభవంగా జరుపుతున్న ఈ వేడుకలకు ప్రత్యేక బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. ఈ నెల 15 నుంచి 23 వరకు జరగనున్న శ్రీనివాసుని నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తిరుమల క్షేత్రం వైభవంగా దీపకాంతులతో ముస్తాబయ్యంది. ఒక్కోరోజు ఒక్కో వాహనంపై శ్రీనివాసుని తిరుమల పుర వీధుల్లో ఊరేగిస్తారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.