జెన్​కో పైప్‌ లైన్‌ లీకేజీతో భారీగా రొయ్యలు మృతి - రైతులు ఆవేదన - Genco Pipe Leakage Prawns Dead

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 17, 2024, 7:57 PM IST

thumbnail
జెన్​కో పైప్‌ లైన్‌ లీకేజీతో భారీగా రొయ్యలు మృతి - రైతులు ఆవేదన (ETV Bharat)

Prawns Dead Due to Leakage of Genco Pipeline: నెల్లూరు జిల్లా ముత్తుకూరులో ఏపీ జెన్​కో పైప్‌ లైన్‌ లీకేజీ అయ్యింది. దీంతో సమీపంలోని చెరువుల్లోకి బూడిద నీరు పోవడంతో భారీగా రొయ్యలు మృతి చెందాయి. బూడిద నీరు విద్యుత్‌ ట్రాన్స్‌ ఫార్మర్‌పై ఎత్తుగా చిమ్మిడంతో ట్రాన్స్‌ ఫార్మర్‌ కాలిపోయింది. చెరువులోని రొయ్యలు మృతి చెందడంతో తాము నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కసారిగా పైపు లీకేజీతో భారీగా రొయ్యలు చనిపోయాయని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. 

అసలు ఏం జరిగిందంటే నేలటూరులోని శ్రీ దామోదరం సంజీవయ్య ధర్మల్ విద్యుత్ కేంద్రంలోని యాష్ పైప్ లైన్ లీకేజీ కావడంతో ప్లాంట్ నుంచి యాష్ పాండ్​కు వెళ్లే జెన్​కో పైప్ లీకేజితో బూడిద నీరు ఎత్తుగా చిమ్మింది. దాంతో చెరువుల్లో ఉన్న రొయ్యలు చనిపోవడం జరిగింది. పైప్ లీకేజితో ఎగసి పడిన బూడిద నీరు విద్యుత్​ ట్రాన్స్ ఫార్మర్​పై పడటంతో వెంటనే మంటలు వ్యాపించి అది కాలిపోయింది. ఆ సమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.