Song On Chandrababu: "సమరంలో వెనుకడుగే వేయడు గెలుపొందే వరకూ".. చంద్రబాబు బర్త్​డే సందర్భంగా స్పెషల్​ సాంగ్​

By

Published : Apr 19, 2023, 2:19 PM IST

thumbnail

Special Song on Chandrababu: సమరంలో వెనుకడుగే వేయడు గెలుపొందే వరకూ అంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు 73వ జన్మదినం సందర్భంగా ఆ పార్టీ నేతలు కేశినేని చిన్ని, వెనిగండ్ల రాము ప్రత్యేక గీతాన్ని ఆవిష్కరించారు. చంద్రబాబు జీవిత ప్రస్థానంపై కథా గానం పేరిట దీనిని రూపొందించారు. చంద్రబాబు జీవిత చరిత్రపై అరుదైన ఫొటోలతో 6 నిమిషాల 50సెకన్ల మేర ఈ గీతం సాగింది. లోకం మెచ్చిన నాయకుడు ఏ లోపం లేనోడే అంటూ సాగిన ఈ గీతాన్ని పార్టీ సీనియర్ నేతలు దేవినేని ఉమా, గద్దె రామ్మోహన్, బుద్దా వెంకన్న, వర్ల రామయ్య, నాగుల్ మీరా తదితరులు విజయవాడలో ఆవిష్కరించారు. చంద్రబాబు కథాగానం చేయటం తమ అదృష్టంగా భావిస్తున్నట్లు కేశినేని చిన్ని, వెనిగండ్ల రాములు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా.. ఆ క్యాబినెట్​లోని సగం మంది మంత్రులు చంద్రబాబు తయారు చేసిన నాయకులేనని మాజీ మంత్రి దేవినేని ఉమా తెలిపారు. చంద్రబాబు కుటుంబంపై నోరు పారేసుకున్న వారెవ్వరినీ వదిలిపెట్టేది లేదని బుద్ధా వెంకన్న, వర్ల రామయ్యలు హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.