నేను చెప్పినట్టు చేయకపోతే సస్పెండ్ చేయిస్తా - సెలవులపై వెళితే ఏసీబీకి పట్టిస్తా ! పర్చూరులో రెచ్చిపోయిన అధికార పార్టీ నేత

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 25, 2023, 12:53 PM IST

thumbnail

Ruling Party Leader Warning Employees at Parchur: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీ నేతలు రెచ్చిపోతున్నారు. 'మేము చెప్పినట్టు చేయాల్సిందే..కాదంటే సస్పెండ్ చేయిస్తాం' అంటూ ఉద్యోగులను హెచ్చరిస్తున్నారు. తమ మాటను వినకపోతే అవినీతి పేరుతో ఏసీబీకి పట్టిస్తాం అంటూ ఉద్యోగుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. తాజాగా ఓటర్ల జాబితాను వైసీపీ జాబితాలా మార్చేయాలంటూ.. బాపట్ల జిల్లా పర్చూరుకు చెందిన ఓ అధికార పార్టీ నేత ఉద్యోగుల్ని హెచ్చరించిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.

YCP Leader Krishna Mohan Warning on Election Lists: 'నేను చెప్పినట్లు చేయాల్సిందే, కాదంటే సస్పెండ్ చేయిస్తా. ఒకవేళ సెలవులపై వెళితే ఏసీబీకి పట్టిస్తా' అంటూ బాపట్ల జిల్లా పర్చూరుకు చెందిన అధికార పార్టీ నేత కృష్టమోహన్‌ తప్పుడు ఫిర్యాదులిస్తూ.. ఉద్యోగుల్ని సస్పెండ్ చేయించి, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. పర్చూరు నియోజకవర్గంలో ఓటర్ల జాబితా వైసీపీ జాబితాలా మార్చేయాలంటూ ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. ఈ క్రమంలో తలొగ్గని అధికారులపై కృష్టమోహన్‌ తప్పుడు ఫిర్యాదులిస్తూ వారిని సస్పెండ్ చేయిస్తున్నారు. దీనికి పరిమాణం.. వారి మాట వినలేదనే నేపంతో మార్టూరు పూర్వ ఎమ్మార్వో సురేష్‌ బాబును ప్రతిపక్ష పార్టీకి సహకరిస్తున్నారంటూ తప్పుడు ఫిర్యాదు చేసి.. ఆఘమేఘాలపై విచారణ జరిపించి, సస్పెన్షన్‌ వేటు వేయించారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులపై జిల్లా ఉన్నతాధికారులతో తీవ్ర ఒత్తిడిని తీసుకొస్తూ.. పట్టుబట్టి పనులు చేయించుకుంటున్నారు. దీంతో అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గని కొంతమంది అధికారులు ఇదివరకే సస్పెన్షన్‌కు గురయ్యారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.