ఎమ్మెల్సీ ఇంటి ముందు బైక్ చోరీ - మరెవరిదో కాదు ఆయన గన్మెన్దే
MLC Gunmen Bike Theft: ఎమ్మెల్సీ ఇంటి ముందు పార్కింగ్ చేసిన వాహనాన్ని ఓ దుండగుడు చోరీ చేశాడు. అది కూడా మరెవరిదో కాదు ఆ ఎమ్మెల్సీ గన్మెన్దే. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా తణుకులో చోటుచేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్.. గన్మెన్ ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తి పట్టపగలే అపహరించుకు పోయాడు. అది కూడా ఎమ్మెల్సీ ఇంటి ముందు ఉంచిన బైక్ దొంగతనం జరగడంపై.. పలు రకాలుగా కామెంట్లు వస్తున్నాయి.
తణుకు పట్టణంలోని సజ్జాపురంలో నివాసం ఉంటున్న ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ వద్ద సురేశ్ అనే వ్యక్తి గన్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఎప్పటిలాగానే సురేష్ తన ద్విచక్రవాహనాన్ని ఎమ్మెల్సీ ఇంటి ముందు ఉంచి విధులకు హాజరు అయ్యాడు. అయితే మధ్యాహ్నం 12:45 - 1.00 మధ్య గుర్తు తెలియని వ్యక్తి ద్విచక్ర వాహనాన్ని అపహరించుకుపోయాడు. చోరీకి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. తన బైక్ చోరీ విషయమై ఎమ్మెల్సీ గన్మెన్ సురేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.