పౌర్ణమి వేళ భోగేశ్వరుడి ఆలయంలో వింత - శివలింగానికి అభిషేకాలు జరిపించిన భక్తులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 27, 2023, 4:43 PM IST

Updated : Nov 27, 2023, 7:19 PM IST

thumbnail

Kartika Masam Special Poojalu In Bhogeshwara Alayam : నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని గడివేముల మండలం భోగేశ్వర స్వామి పై నేరుగా సూర్యకిరణాలు పడ్డాయి. కార్తిక మాసంలో పది రోజులపాటు సూర్యకిరణాలు నేరుగా శివలింగాన్ని తాకుతూ ప్రసరించడం ఇక్కడ ప్రత్యేకత. కార్తిక పౌర్ణమి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో భోగేశ్వరాలయానికి తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివలింగంపై పడుతున్న సూర్య కిరణాలను చూసి భక్తులు శివారాధన చేశారు.

Kartika masam Poojalu In Nandyala District : ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తిక మాసం సందర్భంగా పౌర్ణమిని పురస్కరించుకొని భక్తులు వివిధ ప్రాంతాల నుంచి దైవ దర్శనానికి తరలి వచ్చారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన జనాలు స్వామివారిని దర్శించుకున్నారు.  అనంతరం శివలింగానికి అభిషేకాలు, అర్చనలు చేశారు. ఉదయం 6 గంటల నుంచి సూర్యకిరణాలు నేరుగా స్వామివారిని తాకడంతో ఆ సమయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేరుగా లింగాన్ని తాకుతున్న కిరణాలను, ఆ వెలుగులో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న శివలింగాన్ని భక్తులు దర్శించుకున్నారు.

Last Updated : Nov 27, 2023, 7:19 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.