వైసీపీకి 25 సీట్లు కూడా రావు- జూన్‌ 4 ఫలితాలతో జగన్‌ ఆశలు ఆవిరి: రఘురామ - Raghu Rama Visit Tirumala temple

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 17, 2024, 3:22 PM IST

thumbnail
వైసీపీకి 25 సీట్లు కూడా రావు - జూన్‌ 4 ఫలితాలతో జగన్‌ ఆశలు ఆవిరవుతాయి: రఘురామ (ETV Bharat)

TDP Leader Raghu Rama Krishna Visited in Tirumala: ఎన్నికల్లో వైసీపీకి 25 అసెంబ్లీ స్థానాలు కూడా దక్కవని ఉండి టీడీపీ అభ్యర్థి రఘురామకృష్ణరాజు జోస్యం చెప్పారు. ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే కూటమి అధికారంలోకి రావాలని చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని వెంకటేశ్వరస్వామిని కోరుకున్నట్లు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ధీమా అంతా జూన్​ 4న ఫలితాలు వెలువడ్డాక తలకిందులు అవుతుందని విమర్శించారు. మెజారిటీ స్థానాలలో కూటమి విజయం సాధించి అధికారంలోకి రాబోతుందని ఆయన పేర్కొన్నారు.

వైసీపీ మూకల దాడిలో గాయపడిన పూలివర్తి నానిని గురువారం రఘురామ పరామర్శించారు. తిరుపతిలోని ఆయన నివాసానికి వెళ్లి కుటుంబసభ్యులతో మాట్లాడారు. జూన్​ 4వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. నానిపై జరిగిన దాడిని ఆయన ఖండిస్తున్నామన్నారు. వైసీపీ ఓటమిని అంగీకరించినట్లుగా ప్రజలు భావిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. జూన్​ 4న ఫలితాలు వెలువడిన సాయంత్రం నుంచి వైసీపీలో అంతర యుద్ధం మొదలవుతుందని రఘురామ వ్యాఖ్యానించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.