Jagan Illegal Assets Case: జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ వేగవంతం

By

Published : Jun 30, 2023, 10:27 PM IST

thumbnail

CBI Court Hearing Jagan Illegal Assets Case: హైదరాబాద్​లోని సీబీఐ కోర్టు ఏపీ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసుల విచారణలో వేగం పెంచింది. నాంపల్లి సీబీఐ కోర్టు.. శుక్రవారం జగన్​ అక్రమాస్తుల కేసులపై విచారణ చేపట్టింది. డిశ్చార్జి పిటిషన్లపై వాదనలు జులై 31నాటికి పూర్తి చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. సీబీఐ ఛార్జిషీట్లలో నిందితుల డిశ్చార్జి పిటిషన్లపై విచారణ చేపట్టగా.. ఎనిమిది ఛార్జిషీట్లలో విచారణ ముగిసింది. మరో 3 ఛార్జిషీట్లలో డిశ్చార్జి పిటిషన్లపై విచారణ కొనసాగుతోంది. అంతేకాకుండా ఈడీ 7 ఛార్జిషీట్లలో డిశ్చార్జి పిటిషన్లపై  విచారణ సైతం ముగియగా.. మరో 2 ఛార్జిషీట్లలో డిశ్చార్జి పిటిషన్లపై విచారణ కొనసాగుతోంది. దీంతో జులై 31 నాటికి డిశ్చార్జి పిటిషన్లపై వాదనలు ముగించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జగన్​ అక్రమాస్తుల కేసుపై ఆంధ్రప్రదేశ్​లోని ప్రతిపక్షాలు ప్రశ్నల వర్షం కురిపించాయి. ఇతర కేసుల్లో విచారణలు త్వరగా జరుగుతున్నా.. జగన్​ అక్రమాస్తుల కేసుల్లో అలా ఎందుకు జరగటం లేదని ఆరోపణలు చేశాయి. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.