పల్నాడు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం- ఉవ్వెత్తున ఎగసిపడిన మంటలు
Fire Accident in Palnadu District: పల్నాడు జిల్లా మాచర్లలో సోమవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పట్టణంలోని రింగురోడ్డు ఎస్కేబీఆర్ ప్రభుత్వ కళాశాలకు వెళ్లే రహదారిలో పాత ప్లాస్టిక్ సామాను నిల్వ గోడౌన్‌పై.. బాణసంచా నిప్పురవ్వలు పడ్డాయి. దీంతో మంటలు దావానంలా ఎగసిపడుతూ చుట్టుపక్కలకు వ్యాపించాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
Fire Accident in Macherla Old plastic Storage Godown: సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. మంటలను పెంచే సామగ్రి గోడౌన్లో ఉండటం వల్ల మరింత రాజుకుని ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. చుట్టుపక్కల గృహాల వారిని మరో ప్రాంతానికి తరలించారు. పురపాలక ట్యాంకర్ల నీటితో మంటలను ఆర్పేశారు. గోడౌన్లో మంటలు అదుపులోకి రావటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగిఉంటుందని అంచనాలు వేస్తున్నారు.