Prathidhwani పాలక ప్రభుత్వాల పట్ల మితిమీరుతున్న ప్రభుభక్తి.. పోలీసు దౌర్జన్యాలకు అంతులేకుండా పోతోంది
Published: May 25, 2023, 10:28 PM

Prathidhwani: ఆంధ్రప్రదేశ్‌లో పోలీసుల దౌర్జన్యాలకు అంతులేకుండా పోతోంది. పాలక ప్రభుత్వాల పట్ల ప్రభుభక్తి మితిమీరుతోంది. దళితులు, రైతులు, మహిళలనే తేడా లేకుండా ప్రశ్నించే ప్రతి గొంతుకనూ అణిచివేస్తున్నారు. పౌరహక్కులు ప్రశ్నార్థకం అవుతున్నాయి. భావ ప్రకటనా స్వేఛ్ఛ బందీగా మారుతోంది. న్యాయస్థానాలు ఎన్నిసార్లు మందలించినా వారిలో మార్పు రావట్లేదు. రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలో ఎక్కడా కూడా ఇంతగా పోలీసు వేధింపులు చూడలేదనే మాట సర్వత్రా వినిపిస్తోంది.
అసలు ఆంధ్రాలో ఏం జరుగుతోంది? పోలీస్ రాజ్యంగా మారిందా? రాజ్యాంగం ప్రశ్నార్థకం అవుతోందా? గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్త ఒకరు అప్పటి సీఎం ఇంట్లో మహిళలపై అసభ్య కామెంట్లు పెట్టాడని అరెస్టు చేస్తే మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జు సహా, అనేకమంది మేథావులు, సీనియర్ పాత్రికేయులు ఏపీలో భావప్రకటనా స్వేచ్ఛ గురించి గగ్గోలు పెట్టారు. ఇప్పుడు ఆ మేథావులు అందరూ ఏమయ్యారు? సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వాన్ని విమర్శించినందుకే అరెస్టులు చేస్తున్నారు. నిరసనలకు అనుమతివ్వట్లేదు. ఇచ్చినా వారిపైకి అధికారపార్టీ వారిని ఉసిగొలుపుతున్నారు. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.