రాష్ట్రంలో ఈ-ఆఫీస్‌ అప్‌గ్రేడేషన్‌ ప్రక్రియ వాయిదా- చంద్రబాబు లేఖతో నిలుపుదలకు ఆదేశాలిచ్చిన సీఈవో - E office Upgaradation Postponed

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 17, 2024, 9:44 PM IST

thumbnail
రాష్ట్రంలో ఈ-ఆఫీస్‌ అప్‌గ్రేడేషన్‌ ప్రక్రియ వాయిదా- ప్రతిపక్షాల ఫిర్యాదులతో ఎన్​ఐసీని ఆదేశించిన సీఈవో (ETV Bharat)

E-office Upgaradation Postponed: రాష్ట్రంలో ఈ-ఆఫీస్‌ అప్‌గ్రేడేషన్‌ ప్రక్రియను ఎన్నికల సంఘం వాయిదా వేసింది. సాంకేతిక కారణాల వల్ల ఈ ప్రక్రియ వాయిదా పడింది. ప్రభుత్వ శాఖల్లో ఫైల్స్‌ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ-ఆఫీస్‌ అప్‌గ్రేడేషన్‌ ప్రక్రియను నిలుపుదల చేయాలని గవర్నర్, సీఈవోకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఈ ప్రక్రియపై ఎన్​ఐసీ ప్రతినిధులను పిలిపించి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్ కుమార్ మీనా ఆరా తీశారు. 

ప్రతిపక్షాల ఫిర్యాదులతో ఈ-అప్‌గ్రేడేషన్‌ ప్రక్రియను నిలిపివేయాలని ఎన్​ఐసీని సీఈవో మీనా ఆదేశించారు. శనివారం నుంచి ఈ నెల 25 వరకు ఈ-ఆఫీస్‌ అప్‌గ్రేడేషన్‌ ప్రక్రియ చేపట్టనున్నట్లు ఇటీవలే ఎన్​ఐసీ షెడ్యూల్ విడుదల చేసింది. సీఈవో ముఖేశ్ కుమార్ మీనా తాజా ఆదేశాలతో అప్‌గ్రేడేషన్‌ ప్రక్రియ తదుపరి షెడ్యూల్‌ను తర్వాత విడుదల చేస్తామని ప్రభుత్వశాఖలకు ఎన్​ఐసీ సమాచారం ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న ఈ-ఆఫీస్‌ వెర్షన్‌తోనే విధులు నిర్వహించాలని ఆయా ప్రభుత్వ శాఖలను ఆదేశించింది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.