విద్యావ్యవస్థపై వైసీపీ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం - సీఎం జగన్​ కడప పర్యటనపై ఫైర్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 22, 2023, 12:21 PM IST

thumbnail

Demand To Solve The Problems Of Education Sector:  విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏం ముఖం పెట్టుకొని తన సొంత జిల్లా పర్యటనకు వస్తున్నారని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వలరాజు మండిపడ్డారు. జగనన్న విద్యా దీవెన, జగనన్న గోరుముద్ద తదితర పథకాలన్నింటిని పూర్తిగా నిర్వీర్యం చేశారని విమర్శించారు. కొద్ది మందికి మాత్రమే నిధులు మంజూరయ్యాయని చాలామంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కడప కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు.

AISF And Students Strike In Kadapa Collectorate: తొలుత కోటిరెడ్డి కూడలి నుంచి కలెక్టరేట్ వరకు విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. వసతి గృహాల్లోని విద్యార్థులు  అనేక సమస్యలతో అవస్థలు పడుతున్నారని మండిపడ్డారు. విద్యారంగ వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. నాడు - నేడు పనులు చాలా పాఠశాలల్లో ఇప్పటివరకు పూర్తిస్థాయిలో జరగలేదని పేర్కొన్నారు. కళాశాలలకు ఫీజురియంబర్స్‌మెంట్‌ మంజూరు చేయకపోవడంతో యాజమాన్యాలు ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం లేదని వలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ ఇప్పటికైనా స్పందించి విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని లేదంటే రాష్ట్రస్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని వలరాజు హెచ్చరించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.