జమిలి ఎన్నికలు - దేశంపై దీని ప్రభావం ఎలా ఉండనుంది?

By ETV Bharat Telugu Team

Published : Jan 12, 2024, 9:24 PM IST

thumbnail

Debate on Jamili Elections : లోక్‌సభకు, వివిధ రాష్ట్రాల శాసన సభలకు, దేశవ్యాప్తంగా స్థానిక సంస్థలన్నింటికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న ప్రతిపాదన కొన్నేళ్లుగా చర్చల్లో నలుగుతోంది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సారథ్యంలోని ఉన్నత స్థాయి సంఘం జనవరి 15లోగా సూచనలు, సలహాలు ఇవ్వాల్సిందిగా పౌర సమాజాన్ని కోరుతోంది. ఈ ప్రతిపాదన ఎందుకోసం వచ్చింది? ఎవరి ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి? దేశంపై దీని ప్రభావం ఎలా ఉంటుంది? ప్రజాస్వామ్యం, సమాఖ్య స్ఫూర్తిని ఎంతవరకు ప్రతిబింబిస్తుంది? దీనిలో ఉన్న సవాళ్లేంటి?

ఒకేసారి ఎలక్షన్​ల నిర్వహణ కోసం కొన్ని అసెంబ్లీలను రద్దు చేయడమన్నది రాజ్యాంగ మౌలిక సూత్రాలకే విరుద్ధం కాదా? ఆయా రాష్ట్రాల ప్రాంతీయ ఆకాంక్షలకు ఇది విఘాతం కాదా? ఒకవేళ రామ్‌నాథ్‌ కోవింద్ కమిటీ ప్రజాభిప్రాయ సేకరణలో ఈ ప్రతిపాదనపై తీవ్ర వ్యతిరేకత వచ్చినట్టయితే కేంద్రం వెనక్కు తగ్గుతుందని భావించవచ్చా? లేక మరోరూపంలో అమలు చేయటానికి ప్రయత్నించే అవకాశం ఉందా? అసెంబ్లీల్లో త్రిశంకు సభలు ఏర్పడితే రాష్ట్రపతి పాలన రూపేణా రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం చలాయించే అవకాశాలు లేవా? ఇవే అంశాలపై నేటి ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.