CPI leaders fire on Minister Suresh: ఆదిమూలపు సురేష్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి: సీపీఐ

By

Published : Jul 12, 2023, 7:58 PM IST

thumbnail

CPI leaders dharna in Minister Adimulapu Suresh house: రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ను మంత్రివర్గం నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలంటూ.. మంత్రి ఇంటి ముందు సీపీఐ నాయకులు ఆందోళన చేపట్టారు. మంత్రి సురేష్, ఆయన సోదరుడు సతీష్ కర్నూలు నగరంలోని ముస్లిం మైనార్టీ స్థలాలను ఆక్రమించి, క్రికెట్ అకాడమీ పెట్టారంటూ నిరసన చేపట్టారు. ఆదిమూలపు సురేష్ తల్లిదండ్రుల విగ్రహాలను ఏ విధంగా రోడ్డుపై ఏర్పాటు చేస్తారంటూ.. సీపీఐ నాయకులు మండిపడ్డారు. కాలనీలో ప్రధాన రోడ్డుకు ముందు మంత్రి సోదరుడు రోడ్డును ఆక్రమించి.. షాపులు నిర్మించారని ఆరోపించారు. మంత్రి సురేష్ ఆయన సోదరుడిపై కేసులు నమోదు చేసి, అరెస్టు చేయాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు.

మంత్రి‌, ఆయన సోదరుడిపై కేసులు నమోదు చేయాలి.. సీపీఐ జిల్లా నాయకులు జగన్నాథం మీడియాతో మాట్లాడుతూ..''మంత్రి ఆదిమూలపు సురేష్, ఆయన సోదరుడు సతీష్ కర్నూలులో అక్రమాలకు పాల్పడుతున్నారు. చాణక్యపురి కాలనీలో మంత్రి సురేష్‌కు కళాశాలలు, ఇళ్లు ఉన్నాయి. మంత్రి ఇంటి ముందు 80 అడుగుల రోడ్డు ఉంటే..అందులో పార్క్ పేరుతో ఇరవై అడుగుల రోడ్డును ఆక్రమించారు. అంతేకాకుండా, మంత్రి తల్లిదండ్రుల విగ్రహాలను రోడ్డుపై ఏర్పాటు చేశారు. మంత్రి సోదరుడు రోడ్డును ఆక్రమించి షాపులు ఏర్పాటు చేశారు. జోహార్ పురం రోడ్డులో సర్వే నెంబర్ 927లో బుడ్డా బుడ్డి మసీదుకు చెందిన 15 ఎకరాల పొలాన్ని మంత్రి సోదరుడు ఆదిమూలపు సతీష్ ఆక్రమించుకుని.. క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేశాడు. ముఖ్యమంత్రి జగన్ వెంటనే మంత్రి ఆదిమూలపు సురేష్‌ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి. మంత్రి‌ సురేష్ ఆయన సోదరుడిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలి.'' అని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.