AP Teachers Fedaration Demands to Cancel GPS: ఉపాధ్యాయుల సమస్యలపై ఈ నెల 29న ధర్నా.. రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీటీఎఫ్ అల్టిమేటం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 18, 2023, 7:54 PM IST

thumbnail

AP Teachers Fedaration Demands to Cancel GPS: జీపీఎస్​ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఏపీ టీచర్స్ ఫెడరేషన్ (APTF) డిమాండ్ చేసింది. ఆ సంఘం నాయకులు హృదయరాజు, చిరంజీవి మాట్లాడుతూ ప్రతి నెలా 1వ తేదీన ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించాలన్నారు. 2018 నుంచి బకాయి ఉన్న డీఏలు ఇవ్వాలన్నారు. అలాగే సీపీఎస్ ఉద్యోగులకు బకాయి ఉన్న డీఏ అరియర్స్ 90 శాతం నగదును తక్షణమే మంజూరు చేయాలని కోరారు. దీంతోపాటు 25 వేల ఖాళీలతో నూతన డీఎస్సీని నిర్వహించాలన్నారు. 

ఉపాధ్యాయుల సమస్యలపై ఇప్పటికే అనేక రకాలుగా పోరాటం చేస్తున్నామని, అయినా ప్రభుత్వంలో మార్పు రాలేదని ఏపీటీఎఫ్ నేతలు మండిపడ్డారు. ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచేందుకు విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యలపై ఈ నెల 29వ తేదీన ధర్నా చేపడుతున్నట్లు తెలిపారు. ఈ లోగా ప్రభుత్వం తమతో చర్చలు జరిపి తమ సమస్యలను పరిష్కరించకుంటే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలపై అలసత్వం ప్రదర్శిస్తే.. వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.