అనారోగ్యంపై స్పందించిన సమంత.. అతి కష్టంగా గడచిందని కన్నీళ్లు!

By

Published : Mar 25, 2023, 3:25 PM IST

Updated : Mar 25, 2023, 3:32 PM IST

thumbnail

స్టార్ హీరోయిన్​ సమంత గత రెండేళ్లలో ఎంతగా పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాగ చైతన్యతో విడాకులు.. ఆరోగ్య సమస్యలు.. మరోవైపు హిట్​ సినిమాలు.. ఇలా వార్తల్లో ఫుల్​ హాట్​టాపిక్​గా మారింది. అయితే ఇప్పటికీ ఈ ముద్దుగుమ్మ ఓ వైపు చికిత్స తీసుకుంటూనే సినిమాల్లో నటిస్తోంది. ఇప్పడిప్పుడే అటు మానసికంగా, శారీరకంగా దృఢంగా మారుతోంది. అయితే మయోసైటిస్​తో బాధపడుతున్న సమంత తాజాగా తన ఆరోగ్యం గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తను ఆ వ్యాధి నుంచి కోలుకుంటున్నట్లు తెలిపింది. ఆమె తాజా చిత్రం శాకుంతలం ప్రచారంలో భాగంగా స్టార్ యాంకర్​ సుమతో మాట్లాడిన సామ్​.. తన ఆరోగ్యంపై స్పందించింది. యశోద చిత్ర సమయంలో ఆరోగ్యం చాలా వీక్ గా ఉండేదని, ఆ సినిమా తన భుజాలపై ఉండటంతో బాధ్యతగా భావించి అతి కష్టంగానే ఇంటర్వ్యూలో పాల్గొన్నట్లు గుర్తుచేసుకుని కన్నీళ్లు పెట్టుకుంది. ఇప్పుడు శాకుంతలం కోసం ఆరోగ్యం సహకరిస్తుందని, పూర్తిగా మయోసైటిస్ నుంచి కోలుకుంటూ ధైర్యంగా ఉన్నానని పేర్కొంది.

Last Updated : Mar 25, 2023, 3:32 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.